Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : కళ్యాణ్‌ రామ్‌ సర్‌ప్రైజింగ్‌ లుక్‌ అదుర్స్‌

ఈ గ్యాప్‌లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథలు వినడంతో పాటు ఫిజిక్ విషయంలో దృష్టి పెట్టినట్లుగా ఉన్నాడు.

By:  Ramesh Palla   |   21 Oct 2025 11:52 AM IST
పిక్‌టాక్‌ : కళ్యాణ్‌ రామ్‌ సర్‌ప్రైజింగ్‌ లుక్‌ అదుర్స్‌
X

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈ ఏడాది 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయశాంతిని ఆ సినిమాలో నటింపజేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. కమర్షియల్‌గా కళ్యాణ్‌ రామ్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా నటుడిగా ప్రతి సినిమాకు మంచి పేరును సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్‌ మంచి కథల కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన వద్ద ఒకటి రెండు కథలు ఫైనల్‌ చేసి ఉన్నాయని, వాటిని త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం అందుతోంది. ఆకట్టుకునే విధంగా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈసారి సినిమాతో రావాలని ఆశ పడుతున్నాడు. అందుకే కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అని ఈ నందమూరి హీరో వెయిట్‌ అండ్‌ సీ అన్నట్లుగా తన సినిమాను లేట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.




నందమూరి కళ్యాణ్ రామ్‌ లుక్‌...

ఈ గ్యాప్‌లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథలు వినడంతో పాటు ఫిజిక్ విషయంలో దృష్టి పెట్టినట్లుగా ఉన్నాడు. అందుకే తాజాగా ఆయన లుక్‌ ను చూసి చాలా మంది సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రీక్‌ గాడ్‌ లుక్‌లో కళ్యాణ్‌ రామ్‌ కండలు తిరిగిన బాడీతో వావ్‌ అనిపిస్తున్నాడు. వయసు పెరుగుతున్నా కొద్ది కళ్యాణ్‌ రామ్‌ మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు అంటే లేడీ ఫ్యాన్స్‌ సైతం కామెంట్స్‌ చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఆయన లుక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కళ్యాణ్ రామ్‌ తాజా మేకోవర్‌, ఫిజిక్‌ ను చూస్తూ ఉంటే వచ్చే సినిమాలో ఖచ్చితంగా మంచి సాలిడ్‌ కంటెంట్‌తో, సాలిడ్ లుక్‌తో కనిపించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కళ్యాణ్ రామ్‌ కొత్త సినిమా...

కళ్యాణ్ రామ్‌ ప్రస్తుతం ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్‌ పై వర్క్ చేస్తున్నాడని, ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు మరో వైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సినిమాను సైతం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌ పై స్వయంగా కళ్యాణ్ రామ్‌ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్‌ రామ్‌ సినిమా ప్రారంభించేందుకు గాను ఇలా ముందస్తు బాడీ బిల్డింగ్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌ విషయంలో క్లారిటీ లేదు, దర్శకుడు ఎవరు, ఇతర విషయాలపై క్లారిటీ లేదు. కానీ ఆ సినిమాలో కళ్యాణ్ రామ్‌ లుక్ విషయంలో, ఆయన ఫిజిక్ విషయంలో చాలా క్లారిటీగా ఉంది. ఆయన సాలిడ్‌ లుక్‌తో కనిపిస్తాడనే విశ్వాసంను అభిమానులు ఇప్పటి నుంచే వ్యక్తం చేస్తున్నారు.

బింబిసార 2 సినిమా కోసం వెయిటింగ్‌...

2023 సంవత్సరంలో అమిగోస్‌, డెవిల్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్‌ రామ్‌ బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి సినిమా సైతం బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చింది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నుంచి మళ్లీ బింబిసార వంటి కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం ఉండటం వల్ల తాను హీరోగా ఎక్కువ సినిమాలు చేయలేక పోతున్నట్లు తెలుస్తోంది. బింబిసార సీక్వెల్‌ చేసే ఆలోచన కూడా ఉందని ఆ మధ్య ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. వచ్చే ఏడాదిలో అయినా బింబిసార 2 ఉంటుందేమో అని అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్నారు.