35 ఏళ్ల తర్వాత ఆ నందమూరి హీరో మళ్ళీ వస్తున్నాడు!
టాలీవుడ్ లో నందమూరి వంశానికి ఒక ప్రత్యేకమైన స్థానం, చరిత్ర ఉన్నాయి. ఆ లెగసీ నుంచి వచ్చిన హీరోలు వెండితెరపై తమదైన ముద్ర వేశారు.
By: M Prashanth | 6 Dec 2025 5:18 PM ISTటాలీవుడ్ లో నందమూరి వంశానికి ఒక ప్రత్యేకమైన స్థానం, చరిత్ర ఉన్నాయి. ఆ లెగసీ నుంచి వచ్చిన హీరోలు వెండితెరపై తమదైన ముద్ర వేశారు. ఇక మరికొందరు ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, 80వ దశకంలో తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమై, దాదాపు 35 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇప్పుడు సడెన్ గా ఒక భారీ అప్డేట్ తో ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ వార్త నందమూరి అభిమానులకు నిజంగా ఒక బిగ్ సర్ ప్రైజ్.
రోషన్ మేక హీరోగా నటిస్తున్న 'ఛాంపియన్' సినిమా ద్వారా కళ్యాణ్ చక్రవర్తి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెరసిన గడ్డంతో, కళ్లలో సీరియస్ నెస్ తో ఉన్న ఆయన స్టిల్ చూస్తుంటే.. వయసు పెరిగినా ఆ రాజసం మాత్రం ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. సినిమాలో ఆయన 'రాజి రెడ్డి' అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
నిజానికి స్వప్న సినిమాస్ నిర్మాతలు 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా టైమ్ నుంచే కళ్యాణ్ చక్రవర్తిని సంప్రదిస్తున్నారట. కానీ ఆయన సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 'ఛాంపియన్' కథ విన్న తర్వాత, అందులోని రాజి రెడ్డి పాత్రలోని డెప్త్, ఆ క్యారెక్టర్ లోని రియలిజం నచ్చడంతో ఫైనల్ గా ఓకే చెప్పారట. ఇన్నేళ్ల తర్వాత ఆయన మళ్ళీ మేకప్ వేసుకున్నారంటే ఆ పాత్ర కథలో ఎంత కీలకంగా ఉంటుందో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, 'గిర గిర' సాంగ్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ అప్డేట్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథగా దీన్ని చాలా రిచ్ గా, న్యాచురల్ లొకేషన్స్ లో తెరకెక్కించారు. టెక్నికల్ గా కూడా సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుందని టాక్.
ఒకవైపు కొత్త తరం హీరో రోషన్, మరోవైపు సీనియర్ నందమూరి హీరో కళ్యాణ్ చక్రవర్తి.. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతోందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రోషన్ ఎనర్జీకి, కళ్యాణ్ చక్రవర్తి అనుభవం తోడైతే సినిమా అవుట్ పుట్ అదిరిపోవడం ఖాయం. ఈ సినిమా విజయం సాధిస్తే, కళ్యాణ్ చక్రవర్తిని మరిన్ని మంచి పాత్రల్లో చూసే అవకాశం దొరుకుతుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
