Begin typing your search above and press return to search.

ప్రెజ‌ర్ లో నందమూరి లెగసీ.. అందుకే డెబ్యూ ఆలస్యం?

టాలీవుడ్‌లో ఘన చరిత్ర కలిగిన నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం హీరో ఎంట్రీపై ఒకప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 April 2026 12:20 PM IST
ప్రెజ‌ర్ లో నందమూరి లెగసీ.. అందుకే డెబ్యూ ఆలస్యం?
X

టాలీవుడ్‌లో ఘన చరిత్ర కలిగిన నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం హీరో ఎంట్రీపై ఒకప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు అయిన యువ నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ YVS చౌద‌రి 2024లో చేసిన అనౌన్స్‌మెంట్ మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. కానీ ఆ అనౌన్స్‌మెంట్ తర్వాత ప్రాజెక్ట్ పూర్తిగా సైలెంట్ కావడం ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది.

అనౌన్స్‌మెంట్ తో భారీ బ‌జ్

అప్పట్లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేసిన వీడియోలు, వరుస ప్రెస్ మీట్లు, తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే సినిమా అనే స్టేట్‌మెంట్లు.. సినిమాకు భారీ బజ్ తీసుకొచ్చాయి కానీ ఆ హడావుడి తర్వాత సినిమా అసలు సెట్స్ మీదికి వెళ్లిందా? లేదా అనే ప్రశ్నలకు ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీంతో ఈ ప్రాజెక్టు విష‌యంలో నెల‌కొన్న సైలెన్స్ మిస్ట‌రీగా మారింది.

ఫామ్ లో లేని చౌద‌రి

ఈ నేపథ్యంలోనే డైరెక్ట‌ర్ YVS చౌద‌రిపై కూడా చర్చ మొదలైంది. ఒకప్పుడు స్టార్ హీరోల‌కు స‌క్సెస్‌లు అందించిన ఆయన, ఈ మ‌ధ్య కాలంలో ఫామ్ కోల్పోయినట్టు ఇండస్ట్రీలో అభిప్రాయ‌ముంది. ముఖ్యంగా రేయ్ సినిమా లాంటి ఫలితాలు ఆయన మార్కెట్ ఇమేజ్‌పై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నంద‌మూరి కొత్త హీరోను భారీగా లాంచ్ చేయడంపై రిస్క్ అంచనాలు జరుగుతున్నాయా అన్నది ఆసక్తికర అంశం.

ఫ్యామిలీ స‌పోర్ట్ ఉన్న‌ప్ప‌టికీ..

మ‌రీ ముఖ్యంగా, నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ డిలే అవుతుండటం మరింత చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ లాంటి స్టార్ హీరోలు ఉన్న ఫ్యామిలీలో ఒక డెబ్యూ ప్రాజెక్ట్ ఇంతకాలం పెండింగ్‌లో ఉండటం సాధారణ విషయం కాదు. ఇది ఇంటర్నల్ ప్లానింగ్‌లో భాగమా? లేక ప్రాజెక్ట్‌పై రీవర్క్ జరుగుతోందా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ డిలే వెనుక స్ట్రాటజిక్ డెసిషన్ ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్, కంటెంట్‌పై పెరిగిన అంచనాలు దృష్ట్యా కొత్త హీరోను సరైన స్క్రిప్ట్‌తో, సరైన టైమింగ్‌లో పరిచయం చేయాలనే ఆలోచన ఉండవచ్చని అంటున్నారు. తొందరపడి డెబ్యూ చేస్తే ఇమేజ్‌పై ప్రభావం పడే అవకాశాన్ని ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకుంటుందనే అభిప్రాయం ఉంది. అయితే ఈ మొత్తంలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం.. నందమూరి లెగసీ ప్రెజర్. సీనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు నిర్మించిన బ్రాండ్ ఇమేజ్‌ను కొనసాగించడం చిన్న విషయం కాదు. ఆ లెగసీకి తగ్గట్టుగా డెబ్యూ ప్లాన్ చేయాలనే ఒత్తిడి సహజమే. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, పర్ఫెక్ట్ లాంచ్ కోసం వేచి చూస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో సినిమా అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్స్ లేక‌పోవ‌డం ఈ గాసిప్స్ కు మ‌రింత బ‌లం ఇస్తోంది. ఏదేమైనా ఈ డెబ్యూ మాత్రం సాధారణంగా ఉండ‌ద‌నే విష‌యం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.