Begin typing your search above and press return to search.

ముగిసిన నందమూరి పద్మజ అంత్యక్రియలు.. పాడే మోసిన బాలయ్య!

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇంట్లో ఆగస్టు 19న విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుబాటి పద్మజ తుది శ్వాస విడిచారు.

By:  Madhu Reddy   |   20 Aug 2025 5:09 PM IST
ముగిసిన నందమూరి పద్మజ అంత్యక్రియలు.. పాడే మోసిన బాలయ్య!
X

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇంట్లో ఆగస్టు 19న విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుబాటి పద్మజ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఆగస్టు 19 తెల్లవారుజామున కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారట. వెంటనే హైదరాబాద్ ఫిలింనగర్ సమీపంలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్ కి తరలించగా చికిత్స తీసుకుంటూ పద్మజ శ్వాస విడిచినట్లు వైద్యులు స్పష్టం చేశారు. పద్మజా మరణంతో అటు దగ్గుబాటి కుటుంబం, ఇటు నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పద్మజా మృతికి పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.

మహాప్రస్థానంలో ముగిసిన పద్మజా అంత్యక్రియలు..

ఇదిలా ఉండగా నేడు పద్మజా అంత్యక్రియలు మహాప్రస్థానంలో కుటుంబ సభ్యుల మధ్య ముగిశాయి. నటసింహా నందమూరి బాలకృష్ణ తన వదిన పాడేమోసారు. పద్మజ కొడుకు హీరో చైతన్య కృష్ణ అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేస్తుండగా.. ఆయన వెన్నంటే ఉంటూ అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు బాలయ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పద్మజ - జయకృష్ణ దంపతుల కుమారుడే చైతన్య కృష్ణ..

పద్మజా - జయకృష్ణ దంపతుల కుమారుడు చైతన్య కృష్ణ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన 'ధమ్' అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో పెద్దగా స్కోప్ లేని పాత్ర చేయడంతో ఆయనకు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత హీరోగా మారి 'బ్రీత్' అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినా సరే మరో సినిమా ప్రకటించారు. కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇంతలోనే పద్మజా మరణంతో చైతన్య కృష్ణ పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి కుటుంబంలో కుండమార్పిడి పెళ్లి..

ఇకపోతే నందమూరి కుటుంబంలో కుండ మార్పిడి పెళ్లి జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. నందమూరి తారక రామారావు కూతురు పురందేశ్వరిని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి ఇచ్చి వివాహం చేశారు. ఆయన చెల్లెలు ఎన్టీఆర్ తన కొడుకు జయకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. అలా వీరి కుటుంబంలో కుండమార్పిడి పెళ్లి జరిగింది.

అంత్యక్రియలలో కూలింగ్ గ్లాస్ తో కనిపించిన బాలయ్య..

ఇకపోతే అంత్యక్రియలలో బాలయ్య కూలింగ్ గ్లాస్ తో కనిపించేసరికి అభిమానులు కంగారుపడుతున్నారు. ఆయన కళ్ళకు ఏమైంది అంటూ వార్తలు వైరల్ చేయగా.. కొంతమంది ఆయన కళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యిందని, అది ఇతరులకు సోకకుండా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని మరి కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నారని ఆయనపై ప్రశంసల కురిపిస్తున్నారు.. ఏది ఏమైనా బాలయ్య మాత్రం తన కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.