Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ లో బాలయ్య మిస్.. ఎందుకలా..?

యువ హీరోలతో సమానంగా సీనియర్ హీరోలు ఒక దానికి మించి మరొకటి అనే రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   31 Oct 2025 4:00 PM IST
ఆ సీక్వెల్ లో బాలయ్య మిస్.. ఎందుకలా..?
X

యువ హీరోలతో సమానంగా సీనియర్ హీరోలు ఒక దానికి మించి మరొకటి అనే రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య 100 సినిమా తర్వాత తన వేగాన్ని మరింత పెంచారు. ప్రస్తుతం బాలయ్య 110వ సినిమాగా అఖండ 2 వస్తుంది. ఈ సినిమా తర్వాత 111వ ప్రాజెక్ట్ గా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా కూడా లైన్ లో ఉంది. అదే కాదు ఆదిత్య 999 సినిమా కూడా బాలయ్య చేస్తాడని తెలుస్తుంది. గోపీచంద్ మూవీ, ఆదిత్య 999 రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి.

సినిమాలే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా..

సినిమాలే కాకుండా బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా కూడా తన బాధ్యత నిర్వరిస్తున్నారు. అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ ఇలా రెండిటిలో తన రోల్ ని పర్ఫెక్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఐతే ఓ పక్క వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనకు కోలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్ ఆఫర్ వచ్చింది. ఆ సీక్వెల్ లో క్యామియో రోల్ ని చేస్తున్నారని మీడియా హడావిడి చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ సీక్వెల్ అదే జైలర్ 2 లో బాలయ్య క్యామియో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఐతే ఆ క్యామియో ఇచ్చేందుకు బాలయ్య ఇంట్రెస్ట్ చూపించారట. రజనీకాంత్ అంటే బాలయ్యకు అభిమానమే. వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. రజనీ కోసం అయినా జైలర్ 2 లో చేయాలని అనుకున్నారు బాలయ్య. కానీ ఆ సినిమాకు కాస్త ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఆ ఆఫర్ కాదనేశారట.

కోలీవుడ్ మీడియాలో బాలయ్య క్యామియో కన్ ఫర్మ్ చేస్తూ చిన్న రోల్ కే 50 కోట్ల దాకా తీసుకుంటున్నారన్నట్టు వార్తలు రాశారు. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే బాలయ్య ఎలాంటి క్యామియో రోల్ చేయట్లేదు. ఆయన సినిమాలు చేయడానికే టైం సరిపోవట్లేదని ఫీల్ అవుతున్న బాలయ్య క్యామియో రోల్ చేసే ఛాన్స్ అసలు లేదని తెలుస్తుంది.

జైలర్ 2 లో బాలకృష్ణ మీడియా ఊదరగొట్టింది కానీ..

జైలర్ 2 లో బాలకృష్ణ అంటూ మీడియా ఊదరగొట్టింది కానీ ఆ రోల్ లో బాలయ్య నటించాలంటే చాలా కష్టమని తెలుస్తుంది. అందుకే బాలకృష్ణ బదులుగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ని తీసుకున్నారట నెల్సన్ దిలీప్ కుమార్. అఖండ 2 కోసం హిమాలయాలకు వెళ్లి మరీ షూటింగ్ చేసిన బాలయ్య ఆ టైం లో కొన్ని పొలిటికల్ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వలేకపోయారు. ఐతే అఖండ 2 పూర్తైనా కూడా ఆ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అందుబాటులో ఉండాలి. అందుకే జైలర్ 2 లో క్యామియోకి నో చెప్పేశారట. జైలర్ 2 లో బాలయ్య ఉంటారని ఆశపడ్డ ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ తప్పదు.