Begin typing your search above and press return to search.

బాలయ్యకు ఎలా సాధ్యం అవుతోంది?

నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది ‘దాదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. షూటింగ్ ప్రమాదం కారణంగా ఈ ఏడాది రెండు సినిమాల విడుదల సాధ్యం కాలేదు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి బాలయ్య సిద్ధమవుతున్నారు. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2027లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

By:  Ramesh Palla   |   29 Nov 2026 1:00 PM IST
బాలయ్యకు ఎలా సాధ్యం అవుతోంది?
X

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోల్లో బాలకృష్ణ చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన స్పీడ్‌ను మరే హీరో మ్యాచ్ చేయలేక పోతున్నారు. వరుస సినిమాలు చేయడం మాత్రమే కాకుండా సక్సెస్ రేటు కూడా బాలకృష్ణ బాగా మెయింటెన్‌ చేస్తున్నందుకు అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. గత ఏడాది రెండు సినిమాలతో బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విషయం తెల్సిందే. గత ఏడాది వచ్చిన డాకు మహారాజ్‌, అఖండ 2 సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో బాలయ్య ఈ ఏడాది కూడా రెండు సినిమాలు విడుదల చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఆయన కూడా కచ్చితంగా ఈ ఏడాదిలో రెండు సినిమాలు చేయాలని భావించినప్పటికీ షూటింగ్‌లో ప్రమాదం వల్ల చాలా నెలల సమయం వృధా అయింది. దాంతో ఈ ఏడాది కేవలం దాదా సినిమాతో సరి పెట్టబోతున్నాడు.

బాలకృష్ణ దాదా సినిమాతో రానున్నాడు...

'దాదా' సినిమాను క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఒకవైపు దాదా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. మరోవైపు బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమా కన్ఫర్మ్‌ అయింది. గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. ఫైనల్‌గా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిందని, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ నెలలో సినిమా కోసం అత్యంత కీలకమైన సెట్‌ వర్క్‌ను చేయనున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో అంటే దాదా సినిమా విడుదల అయిన వెంటనే బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ మొదలు...

కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా అనగానే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ కెరీర్‌ ఆరంభంలో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్నాడు. మరోసారి ఆయన తన మార్క్ మాస్‌ బ్లాక్ బస్టర్‌ను బాలకృష్ణతో ఇవ్వడం ఖాయం అని నందమూరి అభిమానులు ధీమాగా ఉన్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించినా కచ్చితంగా సినిమాను 2027 లోనే విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేసుకోవాలని కొరటాల శివకు ముందస్తుగానే బాలకృష్ణ సూచించాడని తెలుస్తోంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు సమానంగా సినిమాలను విడుదల చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వయసులో బాలకృష్ణకు ఇంత స్పీడ్‌ ఎలా సాధ్యం అవుతోంది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాల ఎంపిక, షూటింగ్‌లో పాల్గొనడం అంతా స్పీడ్‌ స్పీడ్‌గా జరుగుతోంది.

బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద...

బాలకృష్ణ కేవలం సినిమా హీరోగానే కాకుండా ఒక ఎమ్మెల్యేగానూ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రతి నెలలో కొన్ని రోజుల పాటు బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించడం, అక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించడం చేస్తూ ఉంటాడు. ఇంత బిజీగా ఉన్న బాలయ్య ఏడాదికి ఒకటి లేదా రెండు ఏళ్లకు ఒకటి అన్నట్లుగా సినిమాలు కష్టం. అలాంటిది బాలకృష్ణ నుంచి ఏడాది రెండు సినిమాల చొప్పున వస్తున్నాయి. ఇది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యం అని ఫ్యాన్స్‌ అంటున్నారు. బాలకృష్ణ అసలు ఖాళీగా ఉండరు అని, ఆయన ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలని అనుకుంటారు. అందుకే ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. ఆయన గతంతో పోల్చితే కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాంతో వరుసగా విజయాలు నమోదు అవుతున్నాయి. అందుకే బాలయ్యకు ఈ స్పీడ్‌, వరుస సక్సెస్‌లు ఎలా సాధ్యం అవుతోందని ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు.