Begin typing your search above and press return to search.

తండ్రిని దూషించిన‌ త‌నూశ్రీని దేవుడు చ‌ల్ల‌గా చూడాల‌ట‌.. నానా ప‌టేక‌ర్ కుమారుడి క్ష‌మాభిక్ష‌

ఇదే సమయంలో తన తల్లిదండ్రులు నానా పటేకర్, నీలకాంత్ పటేకర్ విడిపోయారంటూ జరుగుతున్న ప్రచారంపై మల్హర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

By:  Sivaji Kontham   |   17 Oct 2026 10:48 AM IST
తండ్రిని దూషించిన‌ త‌నూశ్రీని దేవుడు చ‌ల్ల‌గా చూడాల‌ట‌.. నానా ప‌టేక‌ర్ కుమారుడి క్ష‌మాభిక్ష‌
X

దివంగత వెట‌ర‌న్ నటుడు నానా పటేకర్ కుమారుడు మల్హర్ పటేకర్ ఇటీవల తన తండ్రి మృతిపై నటి తనుశ్రీ దత్తా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. అదే సమయంలో తమ కుటుంబంపై సోషల్ మీడియాలో వస్తున్న ర‌క‌ర‌కాల‌ వదంతులు, తప్పుడు ప్రచారాలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. గోవాలో గుండెపోటుతో కన్నుమూసిన తన తండ్రి చివరి రోజుల విశేషాలను, వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో మ‌లార్ ప‌టేక‌ర్ షేర్ చేసారు.

2018లో ఓ సినిమా షూటింగ్ సమయంలో తనను వేధించారంటూ నానాపటేకర్‌పై తనుశ్రీ దత్తా మీటూ (MeToo) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం నానా ప‌టేక‌ర్ కి క్లీన్ చిట్ ల‌భించింది. అయితే నానా పటేకర్ మరణం తర్వాత తనుశ్రీ మరోసారి ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై మల్హర్ స్పందిస్తూ.. ఆ వివాదానికి సంబంధించిన న్యాయపరమైన కేసు ఎప్పుడో ముగిసిపోయిందని.. కోర్టులో క్లియర్ అయిందని స్పష్టం చేశారు. అలాంటి విషయాలను మళ్లీ అనవసరంగా తెరపైకి తెస్తున్న వారి గురించి తాను ప్రత్యేకంగా మాట్లాడదలుచుకోలేదని.. సత్యం ఎప్పటికీ సత్యమేనని.. దేవుడు వారిని చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో తన తల్లిదండ్రులు నానా పటేకర్, నీలకాంత్ పటేకర్ విడిపోయారంటూ జరుగుతున్న ప్రచారంపై మల్హర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం తాము ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబ ఫోటోలు షేర్ చేయనంత మాత్రాన బంధాలు లేవని అర్థం కాదని అన్నారు. దాదాపు 38-39 సంవత్సరాల సుదీర్ఘ బంధం వారిది అని,,, పరిస్థితులు బయటకు కనిపించినట్లుగా ఉండవని తేల్చిచెప్పారు. అలాగే తన తండ్రి చివరి రోజుల్లో ఒంటరిగా ఉన్నారనే వార్తలను పూర్తిగా ఖండిస్తూ.. కుటుంబ సభ్యులమంతా ఎప్పుడూ ఆయన వెంటే ఉన్నామని.. ఆయన ఎన్నడూ ఒంటరిగా లేరని స్పష్టం చేశారు.

నానా పటేకర్ ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ.. ఆయన మరణానికి ముందు కూడా ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారని మల్హర్ తెలిపారు. యువకులు సైతం చేయలేని విధంగా రోజుకు రెండున్నర గంటల పాటు జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేసేవారని ఆయన ఫిట్‌నెస్‌ను కొనియాడారు. అయితే తన తండ్రి గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల ఎంపికలో ఎంతో సెలెక్టివ్‌గా మారారని చెప్పారు. ఒకే రకమైన రిపీటెడ్ పాత్రలు చేయడం ఇష్టం లేక.. నటుడిగా మరింత వినూత్నంగా ఎదగాలని భావించారన్నారు.

సినిమాల కంటే కూడా తన తండ్రి చివరి రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయించి మనశ్శాంతిని పొందారని మల్హర్ వెల్లడించారు. కాశ్మీర్‌లో పాఠశాలల ఏర్పాటు.. రైతుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయడమే ఆయనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంటూ... తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆ సేవా కార్యక్రమాల బాధ్యతను ఇకపై తాను కూడా ముందుకు తీసుకెళ్తానని మల్హర్ స్పష్టం చేశారు.