డ్రింక్ కోసం పార్టీకి వెళ్లాలా? ఇంట్లోనే తాగుతా!
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ పార్టీలకు దూరంగా ఉండటం నానా కోప స్వభావం వంటి పలు విషయాలపై అనిల్ కపూర్ ప్రశ్నించారు.
By: Srikanth Kontham | 24 Sept 2026 4:00 PM ISTబాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్- నానా పాటేకర్ 'పరిందా', 'వెల్కమ్' వంటి ఎన్నో ఆకట్టుకునే చిత్రాలలో కలిసి నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇటీవల 'వన్‌వాస్' చిత్ర ప్రచారంలో భాగంగా జరిగిన లెజెండ్స్ అన్‌ప్లగ్డ్ ముఖాముఖి కార్యక్రమంలో ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ పార్టీలకు దూరంగా ఉండటం నానా కోప స్వభావం వంటి పలు విషయాలపై అనిల్ కపూర్ ప్రశ్నించారు.
పరిశ్రమలో జరిగే పార్టీలకు ఎందుకు హాజరుకావడం లేదని అనిల్ కపూర్ అడిగిన ప్రశ్నకు నానా పాటేకర్ తనదైన శైలిలో సూటిగా సమాధానమిచ్చారు. 'కేవలం డ్రింక్ సేవించడం కోసమే నేను పార్టీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ పని నేను నా ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు' అని బధులిచ్చారు. అలాంటి పార్టీల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులు ఎదురై మూడ్‌ను పాడు చేస్తారని, అలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు తాను వెనకాడనని వ్యాఖ్యానించారు.
నానా పాటేకర్ ఆవేశపడే నైజం, ఘర్షణ పడే విధానంపై కూడా చర్చ సాగింది. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందేనని నానా అభిప్రాయపడగా, ప్రతీ విషయాన్ని గొడవలతో కాకుండా ప్రేమతో కూడా సర్దుబాటు చేసుకోవచ్చని అనిల్ కపూర్ సలహా ఇచ్చారు. దానికి నానా స్పందిస్తూ అవతలి వ్యక్తి ప్రేమను స్వీకరించే స్థితిలో ఉండాలని, పూటుగా తాగి ఉన్నవారికి ప్రేమతో చెప్పినా అర్థం కాదని బదులిచ్చారు.
నానా పాటేకర్ కఠిన వైఖరి , కోపం కారణంగానే చాలా మంది దర్శకులు ఆయనతో పనిచేయడానికి భయప డుతున్నారని అనిల్ కపూర్ ప్రస్తావించారు. 'నువ్వు నిజానికి అంత కోపిష్టివి కావు. కాబట్టి ఇండస్ట్రీలో నీ ఇమేజ్‌ను కొద్దిగా మార్చుకోవచ్చు కదా' అని అనిల్ హితవు పలికారు. దానికి నానా నవ్వుతూ తన వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలని ఈ వయసులో స్వభావాన్ని మార్చుకోవడం సాధ్యం కాదన్నారు.
తనలో ఆగ్రహ స్వభావం వెనుక ఉన్న కారణాలను నానా పాటేకర్ గతంలోనూ వెల్లడించారు. చిన్నతనంలో తల్లి తన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించేదని.. ఆ ప్రభావం వల్లే తనలో ఈ కోపం ఉండిపోయి ఉండొచ్చని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గతంలో `పరిందా` సినిమా సెట్స్‌లో కూడా నానా కోపం వల్ల దర్శకుడు విధూ వినోద్ చోప్రాతో చిన్నపాటి ఘర్షణ జరిగిన విషయాన్ని చోప్రా ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
పదునైన మాటలు, కోపిష్టి స్వభావం ఉన్నా? నానా పాటేకర్ హిందీ చిత్రసీమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఏ విషయాన్నైనా నిజాయితీగా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే న శైలి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటుంది. అనిల్ కపూర్‌తో నానాపటేకర్ సాగించిన ఆసక్తికర సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుతోంది.
