నమ్రత.. ఇంత మోసమా..
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతీ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది.
By: M Prashanth | 29 Oct 2025 9:59 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతీ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆమె ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు షేర్ చేసే ఫోటోలు ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తాయి. లేటెస్ట్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేశారు. నీలి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో, తెల్లటి ప్రింటెడ్ డ్రెస్‌లో ఆమె లుక్స్ అదిరిపోయాయి.
ఈ ఫోటోలు చూస్తుంటే నమ్రత ఏదో వెకేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రశాంతమైన వాతావరణం, సముద్రపు గాలికి ఎగిరే జుట్టుతో ఆమె చాలా రిలాక్స్‌డ్‌గా, ఎంతో అందంగా కనిపిస్తున్నారు. "మ్యాజిక్ లైట్" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ మ్యాజిక్ లైట్ ఆ ప్రదేశానిదా లేక నమ్రత అందానిదా అని కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి, నమ్రత వయసు 53లో ఉన్నా ఆమె పాతికేళ్ల హీరోయిన్ లా మెరిసిపోతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఆమె వయసును తన అందంతో మోసం చేస్తున్నారని మరికొందరు అమ్మాయిలు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా, ఇప్పటికీ అదే గ్రేస్‌ను, ఫిట్‌నెస్‌ను మెయిన్‌టైన్ చేయడం మాములు విషయం కాదని. ఆమె ఆరోగ్యం విషయంలో చాలామందికి ప్రేరణగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.
ఆమెను ఇలా చూసిన ప్రతీసారి మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నారు. "వదిన మళ్లీ సినిమాల్లోకి రావాలి, మహేష్‌తో కలిసి ఓ సినిమా చేయాలి" అని వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటారు. 'వంశీ' సినిమాలో వాళ్ల జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ, పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా నటనకు దూరమయ్యారు. తన ఫోకస్ మొత్తం మహేష్ బాబు కెరీర్‌పై, పిల్లలు గౌతమ్, సితారల పెంపకంపైనే పెట్టారు.
ఇంటి బాధ్యతలను, మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ ఆమె ఫుల్ బిజీగా ఉంటున్నారు. నటనపై ఆసక్తి లేదని ఆమె గతంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది పక్కన పెడితే, నమ్రత మాత్రం తన ఫ్యామిలీ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అప్పుడప్పుడు వెకేషన్ ఫోటోలతో, ఫ్యామిలీ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.
