Begin typing your search above and press return to search.

చీరకట్టులో మహారాణి.. వ‌దిన‌మ్మ సాంప్ర‌దాయానికి మ‌హేష్‌ ఫ్యాన్స్ ఫిదా!

సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో నేటిత‌రానికి ధీటుగా చాలా యాక్టివ్‌గా ఉంటారనే విష‌యం తెలిసిందే.

By:  Sivaji Kontham   |   18 July 2026 10:06 AM IST
చీరకట్టులో మహారాణి.. వ‌దిన‌మ్మ సాంప్ర‌దాయానికి మ‌హేష్‌ ఫ్యాన్స్ ఫిదా!
X

సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో నేటిత‌రానికి ధీటుగా చాలా యాక్టివ్‌గా ఉంటారనే విష‌యం తెలిసిందే. న‌మ్ర‌త ఫ్యాష‌న్ సెన్స్ ఎల్ల‌పుడూ అభిమానుల‌ను ఆక‌ర్షిస్తూనే ఉంటుంది. వెస్ట్రన్ స్టైల్ మోడ్రన్ దుస్తులలో ఎక్కువగా కనిపించే నమ్రత అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్స్ ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన‌ సరికొత్త శారీ లుక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఎంతో అందమైన రెండు శారీ లుక్స్ ని న‌మ్ర‌త షేర్ చేసారు. చీర‌లో ధ‌గ‌ధ‌గా మ‌హారాణిలా మెరిసిపోతూ దిగిన ఫోటోలు, ఈ పోస్ట్‌కు పెట్టిన క్రేజీ క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.




``కొద్దిగా పసుపు రంగు, మరికొద్దిగా పింక్ రంగు... బహుశా ఈ ఏడాదికి నా చీరల కోటా పూర్తయినట్లే!`` అంటూ నమ్రత సరదాగా రాసుకొచ్చారు. తనను ఇంత స్టైలిష్‌గా - ట్రెడిషనల్ లుక్‌లోకి మార్చిన తన పర్సనల్ స్టైలిస్ట్ స్వాతి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్వాతి ప్రోత్సాహం వల్లే తాను ఇంతలా రెడీ కాగలిగానని... ఈ రెండు బ్యూటిఫుల్ లుక్స్ క్రెడిట్ అంతా త‌న‌కే దక్కుతుందని నమ్రత పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై స్టైలిస్ట్ స్వాతి స్పందిస్తూ.. బెస్ట్ పర్సన్ నుండి నేర్చుకుంటున్నాను! అంటూ నమ్రతపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.




నమ్రత షేర్ చేసిన ఈ ట్రెడిషనల్ ఫోటోలపై టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్ జెనీలియా దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. ``ప్రెట్టీ.. ప్రెట్టీ.. ప్రెట్టీ అంటూ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేయగా... నమ్రత సోదరి , సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ ``నా చింటుక్లి చాలా అందంగా ఉంది, లవ్ యు`` అంటూ లవ్ ఎమోజీలు షేర్ చేశారు. అగ్ర‌ హీరోయిన్ నయనతార కూడా ఈ పోస్ట్‌కు స్పందిస్తూ తన అభినందనలు తెలిపారు. వీరే కాకుండా మరికొందరు సెలబ్రిటీలు సైతం నమ్రత ఎలిగెంట్ స్టైల్ కంటెంట్ కి ఫిదా అయిపోయారు.

ఇక మహేష్ బాబు అభిమానులు (ఘట్టమనేని ఫ్యాన్స్) ఈ ఫోటోలు చూసి సామాజిక మాధ్య‌మాల‌లో తెగ వైర‌ల్ చేస్తున్నారు. కామెంట్ల సెక్షన్‌లో ``సాంప్రదాయబద్ధమైన వదినమ్మ``, ``రియల్ ఎలిగాన్స్ అంటే ఇదే``, ``చీరకట్టులో మహారాణిలా ఉన్నారు`` అంటూ అభిమానంగా వ్యాఖ్యానిస్తున్నారు. ``మన సూపర్‌స్టార్ మహేష్ బాబు లైఫ్‌లోకి నమ్రత గారు రావడం ఆయన అదృష్టం.. అలాగే మీ ఇద్దరి జోడీ ఎంతో బ్యూటిఫుల్`` అంటూ అభిమానులు ఈ జంటపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. ఏ వయసులోనైనా నమ్రత గ్లామర్ .. మెయింటైన్ చేసే డిగ్నిటీని ఎవరూ మ్యాచ్ చేయలేరని నెటిజన్లు కొనియాడుతున్నారు.

న‌ట‌న‌కు దూరంగా ఉన్నా మహేష్ బాబు బిజినెస్ వ్యవహారాలను, పిల్లల బాధ్యతలను.. నమ్రతా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ న‌మ్ర‌తా మ‌హేష్‌ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఈ సరికొత్త ట్రెడిషనల్ లుక్స్‌తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు నమ్రత. పసుపు, పింక్ కలర్ చీరలలో నమ్రత శిరోద్కర్ చూపించిన ఈ రాయల్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.