Begin typing your search above and press return to search.

నమిత ఈజ్ బ్యాక్.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేస్తున్న బ్యూటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోకపోయినా.. తమిళ్ , హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

By:  Madhu Reddy   |   16 July 2026 11:10 AM IST
నమిత ఈజ్ బ్యాక్.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేస్తున్న బ్యూటీ!
X

శ్రీను వైట్ల రచన దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్ హీరోగా రోహిత్ నేహా ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చిన సొంతం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది నమిత. నందు పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అందం, అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె.. సన్నని కరెంటు తీగలా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాలో తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. అమాయకత్వంతో చూపురుల దృష్టిని తన వైపు లాగేసుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఒక రాజు ఒక రాణి , ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి , అయితే ఏంటి, నాయకుడు వంటి సినిమాలు చేసిన ఈమె.. సడన్గా తెలుగు తెరకు దూరమయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోకపోయినా.. తమిళ్ , హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. దాదాపు కొన్నేళ్ళ విరామం తర్వాత బిల్లా సినిమాతో రీ ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా 2010లో బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాలో బాగా బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు సన్నని కరెంటు తీగల కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నది ఈమేనా అనే అనుమానాలు కలిగేలా అందరిని ఆశ్చర్యపరిచింది నమిత..

ఇక తర్వాత తమిళ్, కన్నడ, మలయాళం అంటూ సినిమాలు చేస్తూ బిజీగా మారిన నమిత మళ్లీ కనిపించలేదు. ఇక ఈమె బరువు పెరిగిపోవడం వల్ల తెలుగులో మళ్ళీ అవకాశాలు లభించలేదు అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. ఇకపోతే కెరియర్ పై దృష్టి పెట్టిన నమిత మళ్లీ పాత రోజులను గుర్తు చేసేలా తాజాగా ఆమె లేటెస్ట్ లుక్ అందరిని ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా జిమ్ నుండీ ఒక సెల్ఫీ వీడియోని పంచుకుంది. పైగా దీనికి క్యాప్షన్ గా .." మీ మనసు దేనిని నమ్ముతుందో.. మీ శరీరం దానినే అనుసరిస్తుంది" అంటూ క్యాప్షన్ జోడించింది. ఇకపోతే సింహా సినిమా సమయంలో చాలా బరువు పెరిగిపోయి బొద్దుగా కనిపించిన నమిత.. ఇప్పుడు సన్నబడిపోయి మళ్లీ సొంతం సినిమా రోజులను గుర్తు చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నమిత లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు స్టన్ అయిపోతున్నారు.

ఇక నమిత విషయానికి వస్తే.. ప్రస్తుతం వీజే సిద్దు దర్శకత్వంలో రాబోతున్న తమిళ చిత్రం 'దయంగరం'లో ఒక అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలోని తన పాత్ర కోసమే నమిత మళ్ళీ ఇలా సన్నబడిపోయిందనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఏది ఏమైనా నమిత మాత్రం చాలా సన్నగా కనిపిస్తూ.. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇక నమిత లుక్కు చూసి , ఆమెలో వచ్చిన ఈ మార్పులు చూసి అలా ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి నమిత లేటెస్ట్ లుక్ మీరు కూడా చూసేయండి.