Begin typing your search above and press return to search.

నిర్మాతల అరాచకాలకు ఓటీటీ చెక్.. నాగవంశీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఒకప్పుడు ప్రేక్షకులకు నమ్మకం కలిగించే అనౌన్స్‌మెంట్ గా ఉండేది.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 Aug 2026 11:30 PM IST
నిర్మాతల అరాచకాలకు ఓటీటీ చెక్.. నాగవంశీ కామెంట్స్ వైరల్!
X

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఒకప్పుడు ప్రేక్షకులకు నమ్మకం కలిగించే అనౌన్స్‌మెంట్ గా ఉండేది. కానీ గత పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌డం, తర్వాత షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ సమస్యలు, బిజినెస్ లెక్కలు లేదా మార్కెట్ పరిస్థితుల కారణంగా ఆ డేట్‌ను పోస్ట్‌పోన్ చేయడం సాధారణంగా మారిపోయింది. దీని వల్ల రిలీజ్ డేట్స్‌పై ఆడియ‌న్స్, ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో నమ్మకం క్రమంగా తగ్గింది.

ఈ మార్పుపై నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆసక్తికర చర్చకు దారితీశాయి. తాను పోస్ట‌ర్ లో వేసిన డేట్‌కు ఎప్పుడూ సినిమా రాలేద‌ని, దాదాపు 90% సినిమాలు అనౌన్స్ చేసిన టైమ్ కు రిలీజ‌వ‌లేదని, ఇండ‌స్ట్రీలో రిలీజ్ డేట్ కంప‌ల్ష‌న్ అనే నార్మ్ ను తీసేసింద‌ని తానే అని, అందుకే రాండమ్‌గా రిలీజ్ డేట్స్ వేయడం మొదలైంద‌ని ఆయన చేసిన‌ కామెంట్.. టాలీవుడ్‌లో ఒక దశలో నెలకొన్న రిలీజ్ డేట్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. రిలీజ్ డేట్ అనేది ఖచ్చితమైన కమిట్‌మెంట్ కంటే, ఒక మార్కెటింగ్ టూల్‌గా మారిపోయిందనే భావనకు ఈ కామెంట్ బ‌లాన్ని చేకూరుస్తుంది.

అయితే ఈ పరిస్థితిని మార్చడంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషించాయని నాగవంశీ సూచించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వరుసగా రెండు మూడు సినిమాలను కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థలకు రిలీజులు వ‌రుస‌గా పోస్ట్ పోన్ అయితే వారి కంటెంట్ క్యాలెండర్ దెబ్బతింటుంది. అందుకే వారు డెలివరీ షెడ్యూల్స్, రిలీజ్ కమిట్‌మెంట్స్, ఒప్పంద నిబంధనలను మరింత కఠినతరం చేశారని ఆయన చెప్పారు.

ముఖ్యంగా పోస్ట్‌పోన్ చేస్తే ప్రైస్ డిడక్షన్ వంటి క్లాజులు రావడం నిర్మాతలపై ఆర్థిక ఒత్తిడిని పెంచిందని, గతంలో రిలీజ్ ఆలస్యం ప్రధానంగా థియేట్రికల్ మార్కెట్‌కే పరిమితమైతే, ఇప్పుడు ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ డెలివరీ వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతోంది. దీంతో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే ముందు ప్రాజెక్ట్ పురోగతి, పోస్ట్ ప్రొడక్షన్ స్థితి, కంటెంట్ రెడీనెస్ వంటి అంశాలను మరింత జాగ్రత్తగా పరిశీలించే పరిస్థితి ఏర్పడింది.

నిర్మాత‌లుగా తాము చేస్తున్న అరాచకాలు చూసే ఓటీటీ వాళ్లు కూడా ఇలాంటి నార్మ్స్ తీసుకొచ్చార‌ని కూడా నాగవంశీ ఈ సంద‌ర్భంగా నాగ‌వంశీ స‌ర‌దాగా చెప్పారు. ఆయ‌న మాట్ల‌లో టాలీవుడ్ వాస్తవ పరిస్థితిపై ఒక నిజాయితీ అంగీకారం కనిపిస్తుంది. ఆ రేట్ డిడ‌క్ష‌న్ కార‌ణంగా ఇప్పుడు మ‌ళ్లీ చాలా మంది నిర్మాత‌లు చెప్పిన డేట్‌కే సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కూడా ఆయ‌న అన్నారు.