మాదేం తప్పు?.. ఐబొమ్మ రవి హీరో అయిపోయాడు: నాగవంశీ
పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By: M Prashanth | 2 Dec 2025 3:49 PM ISTపైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అతడిని రెండుసార్లు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. దీంతో ఐబొమ్మ రవి అరెస్టుపై అనేక మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. వివిధ వ్యాఖ్యలు కూడా చేశారు.
అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం రవికి ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. చాలా మంది నెటిజన్లు.. సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు. అందులో కొందరు రవిని రాబిన్ హుడ్ తో పోలుస్తూ పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ విషయంపై ఇప్పుడు ప్రొడ్యూసర్ నాగవంశీ రెస్పాండ్ అయ్యారు. ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో మాట్లాడారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న సినిమాల్లో ఒకటి ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. #90స్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఆ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్.. సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది.
ఆ సమయంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. 90స్ లో ఉండే మ్యాజిక్ ను ప్రస్తుత జనరేషన్ వాళ్ళు మిస్ అవ్వడానికి కారణం డిజిటలైజేషన్ అని భావిస్తున్నారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. వెంటనే సోషల్ మీడియా అని నాగవంశీ వేదికపై వ్యాఖ్యానించారు. ఐబొమ్మ రవి గాడినే రాబిన్ హుడ్ చేసిన లోకంలో మనం ఉన్నామని తెలిపారు.
అలాంటిది 90స్ తో ఎలా పోలికలు పెడతారని క్వశ్చన్ చేశారు. అతడేమో అందరికీ రాబిన్ హుడ్ అయిపోయాడని అన్నారు. రూ.50 టికెట్ రేట్లు పెంచితే తామేదో తప్పు చేసిన వాళ్లం అయిపోయామని వ్యాఖ్యానించారు. ఆ అబ్బాయి హీరో అయిపోయాడని, అలాంటి సొసైటీలో ఉంటూ తప్పు ఏం జరిగిందని అడుగుతారు ఏంటండీ.. అంటూ నాగవంశీ సెటైరికల్ గా మాట్లాడారు.
అయితే నాగవంశీ సెటైర్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అన్ని ప్లాట్ ఫామ్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. నాగవంశీ చేసిన కామెంట్స్ పై ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
