PRO వ్యవస్థపై నాగవంశీ అప్పుడు కామెంట్స్.. ఇప్పుడు ఇలా..
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్ గా పీఆర్వో వ్యవస్థపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 30 July 2025 11:02 PM ISTటాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్ గా పీఆర్వో వ్యవస్థపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినీ వర్గాల్లో అవి చర్చనీయాంశంగా మారాయి. అప్పుడు చాలా మంది పీఆర్వోలు హర్ట్ కూడా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయంపై కింగ్ డమ్ మూవీ ప్రమోషన్స్ లో నాగవంశీకి వివిధ ప్రశ్నలు ఎదురయ్యాయి.
మరికొన్ని గంటల్లో కింగ్ డమ్ మూవీ రిలీజ్ కానుండగా.. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు నాగవంశీ. ఆ సమయంలో సినిమా హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన క్వశ్చన్ లకు విజయ్ సమాధానాలిచ్చారు. అదే సమయంలో నాగవంశీ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
"పీఆర్వోలు బెదిరిస్తున్నారు... బ్లాక్ మెయిల్ చేసే రేంజ్ కి వెళ్లి పోయారు అని చెప్పారు. కొందరికి చాలా మందికి కోపం వచ్చింది.. వ్యవస్థను అన్నారు.. పర్టిక్యులర్ గా ఎవరి పేరు చెప్పాలని అనుకున్నారా? మీరు దాని గురించి ఓపెన్ అవ్వాలని అనుకుంటున్నారా?" అని అడగ్గా.. తాను కింగ్ డమ్ తప్ప దేని కోసం ఓపెన్ అవ్వనని చెప్పారు.
"ఒక చిన్న క్లారిటీ కావాలి.. పీఆర్వీల వ్యవస్థపై కామెంట్స్ చేశారు.. దాని వల్ల హర్ట్ అయ్యారు.. ఎవరిని అనాలనుకోవాలో వారినే అనాలి.. పీఆర్వీ వ్యవస్థను నిందించారు. కానీ అందరినీ అనడం కరెక్ట్ కాదు" అని నాగవంశీని ప్రశ్నించగా.. కింగ్ డమ్ రిలీజ్ అయ్యాక పీఆర్వోలందరితో కలిసి కూర్చొని మాట్లాడుతానని అన్నారు.
"కామెంట్ చేసి.. ఒక పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై ఓపెన్ చేశారు.. బెదిరిస్తారా అంటూ చాలా మంది అడుగుతున్నారు.. నింద వేసి తప్పించుకోవడం తప్పు" అని అనగా.. తాను జోక్ చేశానని చెప్పండని నాగవంశీ తెలిపారు. మళ్లీ అడగ్గా.. ప్లీజ్ సర్ రిలీజ్ ఉందని అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే.. మీడియాతో సరైన సంబంధాలు లేకుంటే ఒక సినిమా కిల్ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుందని వ్యాఖ్యానించారు నాగవంశీ. గత 15 ఏళ్లుగా తామే దానిని అలా క్రియేట్ చేసుకున్నామనిపిస్తుందని అన్నారు. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిలో కొందరు పీఆర్వోలు ఉన్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ విషయంపై ప్రశ్నలు ఎదురవ్వగా.. దాటవేసినట్లు కనిపించారు.
