అనగనగా ఒక రాజు.. లీగల్ గా వెళ్లేందుకే కోర్టు ఆర్డర్: నాగవంశీ
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన సంక్రాంతి ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.
By: M Prashanth | 15 Jan 2026 10:10 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన సంక్రాంతి ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ లవ్ కామెడీ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ నిర్మించగా, పండుగ సీజన్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.
అయితే సినిమా విషయంలో డిజిటల్ ప్లాట్ ఫాంలలో వస్తున్న రివ్యూస్, రేటింగ్స్ పై మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించి ఆ న్‌లైన్ రివ్యూస్, రేటింగ్స్ ను చెక్ పెట్టేలా కోర్టు ఆదేశాలు వచ్చాయని మూవీ టీమ్ రీసెంట్ గా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని ఆన్ లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ ప్లాట్ ఫాంలలో రేటింగ్స్, రివ్యూస్ తాత్కాలికంగా డిసేబుల్ అయ్యాయి.
అయితే ఆ నిర్ణయంపై మూవీ టీమ్ స్పందిస్తూ, ఫైనల్ గా సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ప్రేక్షకులేనని, థియేటర్ లో సినిమా చూసే ఆడియన్స్ స్పందనకే ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. ఆన్ లైన్ ఎంగేజ్మెంట్ పేరుతో జరుగుతున్న ఫేక్ రివ్యూస్, ఉద్దేశపూర్వక నెగిటివ్ క్యాంపెయిన్ కు చెక్ పెట్టడమే ఈ చర్య వెనుక అసలైన ఉద్దేశమని స్పష్టం చేసింది.
ఇప్పుడు కోర్టు ఆర్డర్ విషయమై ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీని ప్రశ్నించగా ఆయన క్లారిటీ ఇచ్చారు. "రివ్యూలు ఆపడానికి మేమేం తెచ్చుకోలేదు. ఎవరూ తమ పని ఆపేలా మేం తెచ్చుకోలేదు. సినిమా కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చదు. కానీ మూవీ నచ్చకపోతే ఎటకారంగా, ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఏ ఆర్టిస్ట్ ను కానీ, టెక్నీషియన్ ను కానీ హర్ట్ చేసి రివ్యూ ఇస్తే లీగల్ మూవ్ అవ్వడానికి తెచ్చుకున్నాం" అని తెలిపారు.
"ఎవరి పని ఆపడానికి మాత్రం కాదు. ఎవరినీ ఏదీ ఆపమనలేదు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యాక్ట్ తెచ్చుకున్నాం" అని నాగవంశీ స్పష్టం చేశారు. మరోవైపు.. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్, బాట్స్ ద్వారా ఫేక్ రివ్యూస్ రాయడాన్ని అడ్డుకునేందుకు యాంటి పైరసీ యాప్స్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
బ్లాక్ బిగ్, అప్లిక్స్ వంటి యాప్స్ సహాయంతో ఉద్దేశపూర్వకంగా ఇచ్చే ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ ను కట్టడి చేయనున్నారని సమాచారం. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఇచ్చే జెన్యూన్ రివ్యూస్, నిజమైన రేటింగ్స్ మాత్రమే ఆన్ లైన్ లో కనిపించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే, అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన ఆ నిర్ణయం ఫేక్ రివ్యూస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ గా పరిశ్రమలో మరోసారి చర్చకు దారి తీసింది.
