Begin typing your search above and press return to search.

'ఫంకీ' రిజ‌ల్ట్‌పై నాగ‌వంశీ షాకింగ్ కామెంట్స్‌!

అయితే శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'ఫంకీ' మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీనిపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

By:  Tupaki Entertainment Desk   |   13 Feb 2026 6:05 PM IST
ఫంకీ రిజ‌ల్ట్‌పై నాగ‌వంశీ షాకింగ్ కామెంట్స్‌!
X

మాస్‌కా దాస్ విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యూవీ 'ఫంకీ'. అనుదీప్ కేవి ద‌ర్శ‌కుడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీని నిర్మించిన విష‌యం తెలిసిందే. క‌యాదు లోహ‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. విశ్వ‌క్‌సేన్ త‌న పంథాకు పూర్తి భిన్నంగా చేసిన సినిమా కావ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో స‌హ‌జంగానే సినిమాపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. డైరెక్ట‌ర్ అనుదీప్ మార్కు ఎంట‌ర్ టైన‌ర్‌గా దీన్ని తీర్చి దిద్దారు.

అయితే శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'ఫంకీ' మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీనిపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ముందు నుంచే టాక్ డివైడ్ ఉంటుంద‌ని అనుకున్నాం. ఎందుకంటే దీనిలో ఒక సినిమాకు కావాల్సిన గ్రామ‌ర్ అయితే లేదు. అది లేద‌ని తెలిసే తీశాం. రివ్యూవ‌ర్స్‌కి న‌చ్చుతుంద‌నైతే అనుకోలేదెప్పుడు. కానీ రెగ్యుల‌ర్ పబ్లిక్ కూడా ఎడిట‌ర్ ప్యాచీగా ఉంది అదీ ఇదీ అని అంటున్నారు.. అస‌లు ప్యాచీగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం బ్లాకులు బ్లాకులుగా తీసుకున్నాం. ఒక క‌థ‌ని ఫ్లోగా తీయ‌లేదు.

సినిమాని, క‌థ‌ని డీప్‌గా టెక్నిక‌ల్‌గా చూశారు. నేను మొద‌టి నుంచి అంద‌రికీ ఇదే చెబుతూ వ‌చ్చాను. థియేట‌ర్‌కు వ‌చ్చి న‌వ్వుకుంటూ వెళ్లండి..మ్యాగ్జిమ‌మ్ న‌వ్వించ‌డానికి ట్రై చేసి అనుదీప్ న‌వ్విస్తాడ‌నే చెప్పాను నేను. దానికి ప్రేక్ష‌కుల్ని ఎంత వ‌ర‌కు సంతృప్తి ప‌రిచాం అన్న‌దే చూసుకోవాలి. ఈ సినిమా వ‌ర‌కైతే అంతే. కొన్ని కొన్ని సినిమాలు అంతే. ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి నాకు ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. సెకండ్ హాఫ్ బాగుంది. లాస్ట్‌లో మ‌ద‌ర్ ఎమోష‌న్ బాగుంది..ఫ‌న్ బాగా పండుతుంది. సెకండ్ హాఫ్ టేకాఫ్‌లోనే రెండు బ్లాక్‌లు కానీ ఇది కానీ అన్నీ వ‌ర్క‌వుట్ అవుతున్నాయి.

మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివ‌రాత్రికి రెండు మూడు రోజులు సెల‌వుల్లో డెఫినెట్‌గా థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడండి ఖ‌చ్చితంగా మీ రూ.150 రూపాయ‌ల‌కైతే న్యాయం చేస్తామ‌ని గ‌ట్టిగా అనుకుంటున్నాం. కొన్ని కొన్ని విష‌యాల్లో కొంత మందికి న్యాయం చేయ‌లేక‌పోయాము. న్యాయం చేద్దామ‌ని కూడా ఈ సినిమా తీయ‌లేదు. ఆడియ‌న్స్‌ని న‌వ్వించ‌డానికి తీశాం. అది గ్యారంటీగా న‌వ్విస్తున్నామ‌నే అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూసిరండి డిజ‌ప్పాయింట్ అవ్వ‌రు` అని చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్‌కు ముందు టీజ‌ర్ రిలీజ్‌ఫంక్ష‌న్‌లో నిర్మాత నాగ‌వంశీ `ఈ మూవీలో క‌థ లేద‌ని, కాసేపు కాల‌క్షేపం కోసం ఈ సినిమాకు రావొచ్చ‌ని ముందే హింట్ ఇచ్చేయ‌డం తెలిసిందే.

నాకు ముందే తెలు సు ...

'ఫంకీ' సినిమా శుక్ర‌వారం రిలీజైన సంద‌ర్భంగా చిత్ర బృందం స‌క్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాత నాగ‌వంశీతో పాటు హీరో విశ్వ‌క్‌సేన్‌, హీరోయిన్ క‌యాదు లోహ‌ర్‌, ద‌ర్శ‌కుడు అనుదీప్ కెవీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సినిమాపై వ‌స్తున్న కామెంట్‌ల‌పై ద‌ర్శ‌కుడు అనుదీప్ కెవి స్పందించారు. `గ‌లీజ్` అనే ప‌దం మా సినిమాపై థంబ్‌నెయిల్‌గా వ‌స్తుంద‌ని నాకు ముందే తెలుస‌న్నారు. అది వాడ‌టానికి రెడీగా ఉంటార‌ని ముందే తెలుసు. అయితే సినిమాలో అది కుదురుతుంద‌ని పెట్టాం` అన్నాడు.