Begin typing your search above and press return to search.

70 ఏళ్లకు దగ్గరవుతున్న నాగార్జున హెయిర్ అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం కేరళ ఆయిల్ కాదు... ఏంటంటే.?

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు 'నాగార్జున'...ఈయన కెరియర్ మొదట్లోనే డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాడు.

By:  Gopi Velupala   |   1 Oct 2026 10:34 AM IST
70 ఏళ్లకు దగ్గరవుతున్న నాగార్జున హెయిర్ అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం కేరళ ఆయిల్ కాదు... ఏంటంటే.?
X

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు 'నాగార్జున'...ఈయన కెరియర్ మొదట్లోనే డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. 'రామ్ గోపాల్ వర్మ' దర్శకత్వంలో చేసిన 'శివ' సినిమాతో ఎక్కడలేని క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన ఆ సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. అప్పటినుంచి డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తూ భక్తిరస ప్రధానమైన సినిమాలను కూడా చేస్తూ కమర్షియల్ సినిమాల్లో సైతం తన సత్తా చాటుతున్నాడు... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కింది. అలాగే ఇండస్ట్రీలో కొత్త కథలను ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాడు. అలాంటి నాగార్జున 70 సంవత్సరాలకు దగ్గరవుతున్న కూడా ఇప్పటికీ ఆయన చాలా యంగ్ గా కనిపిస్తుండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఒకవైపు సినిమాలు చేస్తూనే ఆయన బిగ్ బాస్ లాంటి రియాల్టీ షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తుండడం విశేషం... మొత్తానికైతే నాగార్జునను చూసిన చాలా మంది అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయనలాగే మనం కూడా చాలా యంగ్ గా కనిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజుల్లో 20 సంవత్సరాల యంగ్ కుర్రాళ్ళకు సైతం తల మీద జుట్టు ఉండటం లేదు. అలాంటిది నాగార్జున హెయిర్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆయన ఒక్కడే అలా ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అంటూనే ఆయన హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి నాగార్జున తన సినిమాల్లో విగ్గు వాడకుండా తన ఓన్ హెయిర్ స్టైల్ తోనే నటిస్తాడు. అయితే గతంలో నాగార్జున కేరళ నుంచి తెచ్చిన ఒక ఆయిల్ ను వాడడం వల్ల అతని హెయిర్ అంత స్ట్రాంగ్ గా ఉంది అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఆయన హెయిర్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కేరళ ఆయిల్ ఒక్కటే కారణం కాదట.

దానికి తోడు ఆయన రోజు మార్నింగ్ ఖాళీ కడుపు తో క్యారెట్, బీట్ రూట్, ఉసిరికాయ కొంచెం స్పటిక వేసి చేసిన ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ అయితే తాగుతారట. దానివల్లే ఆయన హెయిర్ అంత స్ట్రాంగ్ గా ఉందని ఇప్పటికీ ఊడిపోకుండా చాలా బ్రైట్ గా వెలిగిపోతుందని నాగార్జున మేకప్ మ్యాన్ అయిన చంద్ర ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున లాంటి స్టార్ హీరో ఇప్పటికీ తన అందాన్ని కాపాడుకుంటూనే సినిమాల పరంగా కూడా వైవిద్య భరితమైన కథలను ఎంచుకొని నటుడిగా రాణిస్తున్నాడు. గత సంవత్సరం ఆయన కూలీ, కుబేర లాంటి సినిమాల్లో నెగెటివ్ టచ్ ఉన్న రోల్స్ లో నటించాడు. ఇప్పుడు తన 100 వ సినిమా మీద ఫోకస్ పెట్టాడు. మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వందో సినిమాతో సక్సెస్ ని సాధించి తన అభిమానులకు ఆ సినిమాని గిఫ్టుగా ఇవ్వాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నాడు...