రాజు గారి సెలబ్రేషన్స్ కు కింగ్ సైజ్ అప్‌గ్రేడ్
టాలీవుడ్ లో తనదైన కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్ తో స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jan 2026 5:33 PM ISTటాలీవుడ్ లో తనదైన కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్ తో స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన హీరోగా వస్తున్న తాజా సినిమా అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జనవరి 7 నుంచి 8వ తేదీకి వాయిదా పడ్డ ట్రైలర్
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే మేకర్స్ ట్రైలర్ లాంచ్ కు ప్లాన్ చేశారు. వాస్తవానికి అనగనగా ఒక రాజు ట్రైలర్ లాంచ్ జనవరి 7న జరగాలి. కానీ ఈ రోజున ఎక్కువ ఈవెంట్స్ ఉండటంతో మేకర్స్ ట్రైలర్ లాంచ్ ను జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వినిపిస్తోంది.
అనగనగా ఒక రాజుకు నాగ్ వాయిస్
ఈ సినిమాకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు నిర్మాత నాగవంశీ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అనగనగా ఒక రాజు కింగ్ సైజ్ లో అప్‌గ్రేడ్ అవుతుందంటూ నాగ్ కుర్చీలో కూర్చుని వాయిస్ ఓవర్ చెప్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలుండగా, ఇప్పుడు దానికి నాగ్ వాయిస్ ఓవర్ కూడా తోడవడంతో మూవీపై ఉన్న బజ్ ఇంకాస్త పెరిగింది.
సింగర్ గా మారిన నవీన్
కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా కోసం నవీన్ సింగర్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నవీన్ భీమవరం బల్మా సాంగ్ ను పాడారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పండగ రేసులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా విషయంలో అటు హీరో నవీన్, నిర్మాత నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
