Begin typing your search above and press return to search.

ఒక్క కూలీ.. 100 భాషాల కంటే ఎక్కువ‌!

అక్కినేని నాగార్జున త‌న త‌న ఇమేజ్ చ‌ట్రం నుంచి బ‌య‌టికొచ్చి సినిమాలు చేస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Aug 2025 4:26 PM IST
Nagarjuna Turns Ruthless Villain in Rajinikanth Coolie
X

అక్కినేని నాగార్జున త‌న త‌న ఇమేజ్ చ‌ట్రం నుంచి బ‌య‌టికొచ్చి సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా కుబేర సినిమాలో దీప‌క్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన నాగ్, ఇప్పుడు రజినీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న కూలీ సినిమాలో ఫుల్ లెంగ్త్ విల‌న్ రోల్ లో క‌నిపించ‌నున్నారు. మ‌న్మ‌థుడిగా, సాఫ్ట్ రోల్స్ చేస్తూ హీరోగా క‌నిపించే నాగార్జున ఈ సినిమాలో డిఫ‌రెంట్ గా కనిపించ‌బోతున్నారు.

ఘ‌నంగా కూలీ ట్రైల‌ర్ లాంచ్

ఆగ‌స్ట్ 14న కూలీ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ను చెన్నైలో గ్రాండ్ గా నిర్వ‌హించింది చిత్ర యూనిట్. ఈ కార్య‌క్ర‌మంలో ర‌జినీకాంత్, నాగార్జున‌, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర‌, సౌబిన్ షాహిర్, డైరెక్ట‌ర్ లోకేష్ మ‌రియు మిగిలిన యూనిట్ స‌భ్యులు కూడా పాల్గొన్న‌ప్ప‌టికీ ఈ ఈవెంట్ లో నాగ్ చేసిన వ్యాఖ్య‌లు స్పెష‌ల్ గా మారాయి.

కూలీలో విల‌న్ గా నాగ్

కూలీలో త‌న క్యారెక్ట‌ర్ చాలా క్రూరంగా ఉంటుంద‌ని, ఈ సినిమాలో తాను సైమ‌న్ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నట్టు చెప్పారు. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాను ర‌జినీకాంత్ ఐకానిక్ మూవీ భాషాతో కంపేర్ చేశారు నాగ్. కూలీ సినిమా భాషాలాగా ఉండ‌ద‌ని, దానికంటే 100 రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని నాగార్జున చెప్ప‌డంతో ఆయ‌న చేసిన కామెంట్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

సైమ‌న్ క్యారెక్ట‌ర్ అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేస్తుంది

సినిమాలో సైమ‌న్ క్యారెక్ట‌ర్ ఆడియ‌న్స్ ను త‌ప్ప‌క స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని, డైరెక్ట‌ర్ లోకేష్ త‌న క్యారెక్ట‌ర్ ను చాలా కొత్త‌గా డిజైన్ చేశార‌ని, రజినీ ఫ్యాన్స్ కు కూలీ సినిమా ఫైర్ వ‌ర్క్స్ లా ఉంటుంద‌ని చెప్పి కూలీ సినిమాపై ఉన్న అంచ‌నాలను ఆకాశానికి అంటించారు నాగార్జున‌. ఏదైనా నాగార్జున కూలీ సినిమాతో విల‌న్ గా మార‌డం అందరి దృష్టిని ఆక‌ర్షించ‌డంతో పాటూ నాగ్ కు కూడా ఈ సినిమా మ‌రింత ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ సినిమాతో నాగ్ విల‌న్ గా ఆక‌ట్టుకుంటే ఫ్యూచ‌ర్ లో నాగ్ కు మ‌రిన్ని అవ‌కాశాలొచ్చే వీలుంది.