Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబో.. 27 ఏళ్ల తర్వాత ఇలా..

ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ ది స్క్రీన్ లో ఫ్రెండ్ షిప్ సినిమాలకు ప్లస్ అయ్యేది. నాగ్, టబు జంట సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

By:  M Prashanth   |   9 Oct 2025 12:52 PM IST
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబో.. 27 ఏళ్ల తర్వాత ఇలా..
X

ఇండస్ట్రీలో కొన్ని ఎవర్ గ్రీన్ పెయిర్స్ ఉంటాయి. ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తే చాలు బొమ్మ బ్లాక్ బస్టర్ అనేవారు అప్పట్లో. బిగ్ స్క్రీన్ పై తామ ఫేవరెట్ స్టార్స్ కనిపిస్తే.. సినిమా సంపూర్ణం అయ్యిందన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పటికీ అలాంటి పెయిర్స్ ను సక్సెస్ ఫార్ములాగా మేకర్స్ యూజ్ చేస్తున్నారు. అలా తెలుగులో చాలానే ఉన్నాయి..అందులో ఒకటి అక్కినేని నాగార్జున టబు జంట ఒకటి.

ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ ది స్క్రీన్ లో ఫ్రెండ్ షిప్ సినిమాలకు ప్లస్ అయ్యేది. నాగ్, టబు జంట సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య రూమార్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ టబు హైదరాబాద్ వస్తే తనను కలుస్తుందని నాగ్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. రూమర్స్ ఎన్ని వచ్చిన తాము పట్టించుకోమని మా మధ్య మంచి స్నేహం ఉందని నాకు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ జోడీతో సినిమా చేస్తే ఇప్పుడు కూడా చూసేవాళ్లు అనేకం ఉన్నారు. నిన్నే పెళ్లాడతాలో సినిమా మాత్రం ఈ ఇద్దరి కెరీర్ లకు హైలైట్. ఇందులో కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేంది. సిసింద్రి, ఆవిడ మా ఆవిడే వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్ పంచుకోలేదు. ఈ జోడీ మళ్లీ ఎప్పుడు తెరపై కనిపిస్తుందా అని అక్కినేని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్లలో ఇది ఎప్పుడూ వర్కౌట్ కాలేదు. కానీ, తాజాగా మళ్లీ నాగ్ టబు కాంబోకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున తన 100వ చిత్రం మొదలు పెట్టేశారు. ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయ్యింది. లాటరీ కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే నాగ్ కెరీర్ లో 100వ చిత్రం కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలోనే ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ టబును సంప్రదించారని తెలుస్తోంది. ఆమె కూడా ఓకే చెప్పారని సమాచారం. దీంతో నాగ్ టబు మరోసారి వెండితెరపై కనిపించనున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది ఫైనలైజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ కు పండగే. దాదాపు 27ఏళ్ల తర్వాత ఇద్దరూ స్ర్కీన్ పంచుకుంటారు. సినిమాకు కూడా ఇది హైలైట్ అవుతుందనండలో సందేహం లేదు. మరోవైపు నాగ్ రీసెంట్ గా కుబేర, కూలీ సినిమాల్లో కనిపించారు. హీరోగా కాకుండా కొత్త పంతా ట్రై చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ విభిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి 100వ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి.