Begin typing your search above and press return to search.

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారనే విషయాన్ని మరోసారి నిరూపించారు. గతంలో రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం వంటి దర్శకులతో పాటు పలువురు నటీనటులకు అవకాశాలు కల్పించిన నాగ్.. ఇప్పుడు ‘ఇట్లు అర్జున్’తో హీరోగా పరిచయమవుతున్న అనీష్‌కు అండగా నిలిచారు. అనీష్ తండ్రి తనకు కుటుంబ స్నేహితుడని, కథ నచ్చడంతో పాటు హీరో ధైర్యం నచ్చి సినిమాను సమర్పిస్తున్నానని నాగార్జున తెలిపారు. ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   8 Nov 2026 4:40 PM IST
అందుకే అత‌డు టాలీవుడ్ రియ‌ల్ కింగ్
X

టాలీవుడ్ లో ఎంద‌రు టాప్ హీరోలు ఉన్నా నాగార్జున ప్ర‌త్యేకతే వేరు. అత‌డు రియ‌ల్ కింగ్ అని నిరూపించిన చాలా సంద‌ర్భాల్ని అభిమానులు ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు. తెలుగు చిత్ర‌సీమ‌లో స్నేహానికి గొప్ప విలువిచ్చే హీరోగా నాగార్జున అందుకునే గౌర‌వం వేరు. మెగాస్టార్ చిరంజీవితో ఆయ‌న స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప‌ర‌స్ప‌ర గౌర‌వం, ప్రేమాప్యాయ‌త‌ల‌ను ప్ర‌జ‌లు చాలా సంద‌ర్భాల్లో చూసారు. స్టార్లు, టెక్నీషిన్ల‌తో నాగ్ ఎంతో స్నేహంగా, స‌న్నిహితంగా మెలుగుతారు. అంతేకాదు..స‌రైన‌ ప్ర‌తిభ‌కు అవ‌కాశాలు ఇచ్చి ఎంక‌రేజ్ చేయ‌డంలోను ఎప్పుడూ ముందుంటారు.

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు అవ్వ‌డానికి నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహం గురించి తెలిసిన‌దే. `శివ` చిత్రంతో ఆర్జీవీ ఓవ‌ర్ నైట్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ అవ‌కాశం ఇచ్చింది నాగార్జున‌. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి `జాన‌కి రాముడు` చిత్రంతో తొలి బిగ్ బ్రేక్ ఇచ్చింది నాగార్జున అని ఎంద‌రికి తెలుసు? బాహుబ‌లి ర‌చ‌యిత‌గా విజ‌యేంద్రుడి ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం అయింది ఇటీవ‌లి కాలంలో. ఆర్జీవీని ప‌రిచ‌యం చేసిన అదే సంవ‌త్స‌రం (1989)లో `గీతాంజ‌లి` చిత్రంతో మ‌ణిర‌త్నంని తెలుగుకి ప‌రిచయం చేసారు. వైవియ‌స్ చౌద‌రి, ద‌శ‌ర‌థ్, క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ లాంటి ప్ర‌తిభావంతుల‌కు డెబ్యూ ద‌ర్శ‌కులుగా అవ‌కాశాలు క‌ల్పించారు. సందీప్ గుణ్ణం, పిసి శ్రీరామ్, ఎస్ గోపాల్ రెడ్డి వంటి వారికి నాగ్ స్నేహితుడే కాదు.. వారంద‌రికీ విరివిగా అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్‌ని `క్రిమిన‌ల్` సినిమాతో తెలుగు తెర‌కి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసారు నాగ్. సందీప్ చౌతా లాంటి గ్రేట్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కి అవ‌కాశం క‌ల్పించారు.

అనుష్క‌, అయేషా ట‌కియా లాంటి టాప్ బ్యూటీస్ ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ద‌క్కుతుంది.

అంతేకాదు రాజ్ త‌రుణ్, అవికా గోర్ లాంటి న‌వ‌త‌రం స్టార్ల‌ను, ఇంకా ఎంద‌రో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను కూడా నాగార్జున తెర‌కు ప‌రిచ‌యం చేసారు. ఒక న‌టుడిగా, నిర్మాత‌గా కొత్త ప్ర‌తిభ‌కు ఆయ‌న ఇచ్చే ప్రోత్సాహం ఎంతో గొప్ప‌ది.

ఇప్పుడు కూడా ఒక డెబ్యూ హీరోని ఎంక‌రేజ్ చేస్తున్నారు.. ఈ డెబ్యూ హీరో తండ్రితో ఉన్న స్నేహానికి విలువ‌, గౌర‌వం ఇస్తూ ఆయ‌న చేస్తున్న ఈ ప‌ని ఎంతో గొప్ప‌ది. `ఇట్లు అర్జున` సినిమాతో తెలుగు కుర్రాడు అనీష్ ని టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేస్తూ అత‌డు మ‌రోసారి మంచి మ‌న‌సులో ఒకే ఒక్క `కింగ్` అని నిరూపిస్తున్నారు. హీరోగా ప‌రిచ‌యం అవుతూనే మూగవాడిగా ప్ర‌యోగానికి దిగిన అనీష్ కి కింగ్ ఇస్తున్న స‌పోర్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా క‌థాంశం నచ్చి.. హీరో అనీష్ గ‌ట్స్ న‌చ్చి తాను ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా మారాన‌ని నాగార్జున తాజాగా యాంక‌ర్ ప్ర‌దీప్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అంతేకాదు హీరో అనీష్ తండ్రి త‌న‌కు ఫ్యామిలీ ఫ్రెండ్ అని త‌న‌కు చాలా కాలంగా తెలుసున‌ని దానికి గౌర‌వం ఇచ్చి కూడా అనీష్ ని ప్రోత్స‌హిస్తున్నాన‌ని వెల్ల‌డించారు.

స్నేహానికి ఇంత విలువ ఇస్తాడు.. కొత్త‌వారికి ఛాన్సిస్తాడు.. మంచి క‌థ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తాడు.. అందుకే అత‌డు టాలీవుడ్ రియ‌ల్ కింగ్ అని ఇప్పుడు మ‌రోసారి అంద‌రూ అంగీక‌రిస్తున్నారు. అనీష్, అన‌స్వ‌ర జంట‌గా న‌టించిన ఇట్లు అర్జున చిత్రానికి మ‌హేష్ ఉప్ప‌ల ద‌ర్శ‌కుడు కాగా, వెంకీ కుడుముల నిర్మాత‌. న‌వంబ‌ర్ 13న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.