Begin typing your search above and press return to search.

కొడుకు కోసం నాగ్.. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోలేదా?

తమ వర్క్ కల్చర్‌ ను అలాగే కొనసాగించమని చెప్పడమే కాకుండా, ఎవరి పని వారే కంఫర్ట్ గా చేసుకునేలా చూశారని పేర్కొన్నారు.

By:  M Prashanth   |   12 July 2026 12:38 PM IST
కొడుకు కోసం నాగ్.. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోలేదా?
X

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు వినిపిస్తుంటాయి. కానీ రీసెంట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ మాత్రం ఆయన పర్సనాలిటీని మరో యాంగిల్ లో చూపించాయి. ముఖ్యంగా తన కొడుకు అఖిల్ మూవీ కోసం ఎంత కేర్ తీసుకున్నా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా వ్యవహరించారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ మూవీ సక్సెస్ మీట్‌ లో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. సాధారణంగా స్టార్ హీరోలు లేదా సీనియర్ నటులు తమ ఫ్యామిలీ మెంబర్స్ సినిమాల విషయంలో జోక్యం చేసుకుంటారనే అభిప్రాయం ఉంటుంది. అయితే నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని నాగవంశీ వెల్లడించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో నాగార్జున దాదాపు 20 రోజుల పాటు సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఆఫీస్ కు వచ్చి ఎడిటింగ్, రీ-రికార్డింగ్ వంటి పనులు గమనించారని చెప్పారు.

అయినప్పటికీ ఎక్కడా తన హోదాను చూపించకుండా, యూనిట్ వర్క్ స్టైల్ ను మార్చకుండా, అందరూ ఎలా పని చేస్తున్నారో అలాగే కొనసాగనిచ్చారని వివరించారు. నాగార్జున రేంజ్ లో ఉన్న వ్యక్తి కార్యాలయానికి రావడం అంటే సహజంగా అక్కడి వాతావరణం మారిపోతుంది. అందరూ ఆయనకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా రాకుండా ఆయన ఎంతో సాధారణంగా వ్యవహరించారని నాగవంశీ తెలిపారు.

తమ వర్క్ కల్చర్‌ ను అలాగే కొనసాగించమని చెప్పడమే కాకుండా, ఎవరి పని వారే కంఫర్ట్ గా చేసుకునేలా చూశారని పేర్కొన్నారు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్ అని, అందులో ప్రతి ఒక్కరి పని ముఖ్యమనే విషయాన్ని నాగార్జున తన ప్రవర్తనతో చూపించారని నాగవంశీ అభిప్రాయపడ్డారు. ఎక్కడా అనవసర సూచనలు చేయకుండా, అవసరమైన చోట మాత్రమే తన అభిప్రాయాన్ని చెప్పడం ఆయన ప్రత్యేకత అని చెప్పారు. అందుకే ఆయనతో కలిసి పనిచేసిన రోజులు తనకు ప్రత్యేక అనుభవంగా నిలిచాయని వెల్లడించారు. నాగవంశీ స్పీచ్ లో మరో అంశం కూడా ఆకట్టుకుంది.

నాగార్జునను తాను ఎన్నేళ్లుగా చూస్తున్నప్పటికీ, ఇటీవల ఆయన అంత భావోద్వేగానికి గురవడం ఇదే తొలిసారి చూశానని అన్నారు. అఖిల్ కోసం పడిన కష్టం, సినిమా పట్ల చూపిన డెడికేషన్, చివరకు ప్రేక్షకుల రెస్పాన్స్... ఇవన్నీ కలిసి నాగార్జునను ఎమోషనల్ అయ్యేలా చేశాయని వ్యాఖ్యానించారు. అయితే తన కొడుకు సక్సెస్ కావాలనే తండ్రి ఆరాటం ఒకవైపు కనిపించినా, అదే సమయంలో మూవీ టీమ్ వర్కింగ్ స్టైల్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.

స్టార్ ఇమేజ్ కంటే టీమ్ కంఫర్ట్‌ కు ఇంపార్టన్స్ ఇవ్వడం నాగార్జునలోని మరో యాంగిల్ ను బయటపెట్టిందని చెప్పాలి. సినిమా విజయం వెనుక కేవలం స్క్రీన్ పై కనిపించే నటుల కష్టమే కాదు, స్క్రీన్ వెనుక పనిచేసే ప్రతి ఒక్కరి కష్టం ఉంటుందనే విషయాన్ని గుర్తించినట్లే. కొడుకు కోసం ఎంత కష్టపడినా, ఆ జర్నీలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగాలనే నాగార్జున ఆలోచనే ఆయనపై మరింత గౌరవాన్ని పెంచుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.