కింగ్ తో మెరిసిన శ్రీలీలా.. ఎంత క్యూట్ గా ఉన్నారో!
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ వాటికి అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
By: Madhu Reddy | 12 Dec 2025 3:05 PM ISTఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ వాటికి అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడమే కాకుండా భారీగా ఆదాయాన్ని కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున, శ్రీ లీలాకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విషయంలోకి వెళ్తే ఒక జ్యువెలరీ సంస్థ స్థాపించబడి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పంజాగుట్ట, హైదరాబాదులో ఒక గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నాగార్జున, శ్రీ లీలా విచ్చేసి ఈవెంట్ ను మరింత సక్సెస్ చేశారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ విషయాన్ని బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున బిగ్ బాస్ వేదికగా తెలియజేసిన విషయం తెలిసిందే.
ఈవెంట్ విషయానికి వస్తే.. సిల్క్ యాష్ కలర్ ప్రింటెడ్ కుర్తా ధరించిన నాగార్జున తన లుక్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. 66 ఏళ్ల వయసులో కూడా అంతే అందంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు . ఇక ఈయనతో పాటు శ్రీ లీలా కూడా సందడి చేసింది. గోల్డెన్ కలర్ ట్రెండీ లెహంగా ధరించిన ఈమె సంప్రదాయంగా పువ్వులు పెట్టుకొని మరింత అందంగా కనిపించింది. మొత్తానికైతే అటు నాగార్జున ఇటు శ్రీ లీల తమ అందంతో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తమ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించారు అని చెప్పవచ్చు.
నాగార్జున విషయానికి వస్తే.. 66 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కుబేర, కూలీ వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరించిన ఈయన.. ఇప్పుడు తన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న చిత్రం ఇది. ఇందులో అనుష్క శెట్టి, కీర్తి సురేష్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 మే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగ్ 100 , లాటరీ కింగ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాతో ఎలాగైనా 100 కోట్ల క్లబ్లో చేరాలని నాగార్జున గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయన కోరికను దర్శకుడు కార్తీక్ ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి.
అటు శ్రీ లీల విషయానికి వస్తే.. యంగ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె ఈమధ్య కాలంలో హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటుంది. కానీ స్టార్ స్టేటస్ ను అయితే సొంతం చేసుకోలేదని చెప్పాలి. ఇటీవల రవితేజతో వచ్చిన మాస్ జాతర కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో కలిసి పరాశక్తి అనే సినిమాలో నటిస్తోంది శ్రీ లీల. అలాగే శివ కార్తికేయన్ తో మరో చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ చిత్రాలు ఎటువంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.
