పిక్‌టాక్ : సైమన్ గా కింగ్ ఇలా మేకోవర్
ఇదే సమయంలో ఆయన లుక్ గురించి మాత్రం ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఖచ్చితంగా నాగ్ లుక్ ఇతర పాత్రల్లో చేసిన అందరి నటీనటులతో పోల్చితే బెస్ట్‌గా ఉందని అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు.
By: Ramesh Palla | 21 Aug 2025 12:28 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'కూలీ'. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా క్రేజీ కాంబో కావడంతో భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు సినిమా రూ.400 కోట్లకు మించి వసూళ్లు రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించడం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. కూలీ సినిమాలో నాగార్జున పూర్తి స్థాయి విలన్ పాత్ర చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సైమన్ పాత్రలో నాగార్జున ఆకట్టుకున్నాడు. చాలా క్రూరమైన పాత్రతో పాటు, కాస్త ఎమోషనల్ టచ్ ఉన్న సీన్స్ సైతం ఉండటంతో నాగార్జున పాత్రకు ప్రాణం పోసినట్టుగా నటించాడు అంటూ అభిమానులు, కొందరు రివ్యూవర్స్ కామెంట్స్ చేశారు.
కూలీ సినిమాలో సైమన్ పాత్ర కోసం నాగార్జున లుక్
నాగార్జున పాత్ర విషయంలో కొందరు విమర్శలు సైతం చేశారు. నాగార్జున ఆ పాత్ర చేయడం వల్ల అత్యంత హింసాత్మకంగా చూపించలేదని, ఆ పాత్రలో మరే స్టార్ ఉన్నా ఖచ్చితంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ పాత్రను మరింత హింసాత్మకంగా చూపించి ఉండేవాడు అనేది చాలా మంది అభిప్రాయం. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నాగార్జున విలన్‌గా ఆకట్టుకోలేక పోయాడు అనేది కొందరి మాట. మొత్తానికి ఎవరికి తోచిన విధంగా వారు నాగార్జున పోషించిన సైమన్ పాత్ర గురించి విశ్లేషణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన లుక్ గురించి మాత్రం ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఖచ్చితంగా నాగ్ లుక్ ఇతర పాత్రల్లో చేసిన అందరి నటీనటులతో పోల్చితే బెస్ట్‌గా ఉందని అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు.
లోకేస్ కనగరాజ్ ప్రత్యేక దృష్టి
కూలీ సినిమాలోని నాగార్జున పోషించిన సైమన్ లుక్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ చాలా ప్రత్యేకంగా నాగార్జున హెయిర్ స్టైల్ డిజైన్ చేశాడు. అంతే కాకుండా మేకోవర్ సైతం చాలా సింపుల్‌గా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో మరింత స్టైల్‌గా ఉన్నాడని, స్టైలిష్ విలన్‌గా నాగార్జున కనిపించాడని సోషల్ మీడియాలో అభిమానులతో పాటు, నెటిజన్స్ చర్చించుకున్నారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోను హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ షేర్ చేశారు. ఇందులో నాగార్జున లుక్ ను లోకేష్ కనగరాజ్ దగ్గరగా ఉండి, జాగ్రత్తలు తీసుకుని మరీ డిజైన్ చేసినట్లుగా చూడవచ్చు. మేకోవర్ రెడీ అయిన తర్వాత లోకేష్ కనగరాజ్ ఫోటోను తీసుకోవడం కూడా మనం ఈ ఫోటోలో కూడవచ్చు.
నాగార్జున కొత్త సినిమా కోసం ఎదురు చూపులు
కూలీ సినిమాలో నాగార్జున పాత్ర విషయంలో సంతృప్తిగా ఉన్న అభిమానులు ముందు ముందు మరిన్ని విలన్ రోల్స్ చేయాలని కోరుకుంటున్నారు. కొందరు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓకే గానీ సినిమాల్లో విలన్‌గా మాత్రం చేయవద్దు అంటున్నారు. కుబేర సినిమాతో పాటు కూలీ సినిమాలో నాగార్జున హీరోగా కాకుండా ముఖ్య పాత్రలో నటించాడు. ముందు ముందు కూడా అలాంటి పాత్రలే చేస్తాడా అనేది చూడాలి. హీరోగా సినిమా వచ్చి ఏడాదిన్నర అయింది. ఇప్పటి వరకు కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడం లేదు. ఈ ఏడాది చివర్లో ఒక సినిమాను పట్టాలెక్కించి, వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఆ సీజన్‌కు నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
