జడ్జిమెంట్ ట్రాక్ తప్పిందా..?
కింగ్ నాగార్జున కూలీ సినిమాలో చేసిన సైమన్ రోల్ గురించి అంతటా డిస్కషన్ జరుగుతుంది. అసలు ఈ రోల్ నాగార్జున ఎలా ఒప్పుకున్నాడబ్బా అనే డౌట్ వస్తుంది.
By: Ramesh Boddu | 16 Aug 2025 6:00 PM ISTకింగ్ నాగార్జున కూలీ సినిమాలో చేసిన సైమన్ రోల్ గురించి అంతటా డిస్కషన్ జరుగుతుంది. అసలు ఈ రోల్ నాగార్జున ఎలా ఒప్పుకున్నాడబ్బా అనే డౌట్ వస్తుంది. మొన్ననే కుబేర సినిమాలో దీపక్ రోల్ లో షాక్ ఇచ్చాడు నాగార్జున. సినిమా కూడా అంత గొప్పగా ఏం లేదు. ఆ సినిమా చేయడమే ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇక కూలీ చూసిన అక్కినేని ఫ్యాన్స్ అయితే చాలా అప్సెట్ అయ్యారు. హీరో, విలన్ రెండిటికీ నాగార్జున తీసుకునే రెమ్యునరేషన్ ఒకటే కానీ ఆయన స్థాయి రోల్ చేస్తున్నాడా లేదా అన్నది పాయింట్.
నాగార్జున సైమన్ రోల్..
ఈమాత్రం దానికి లోకేష్ రావడం నాగార్జున పంపించడం.. ఇలా దాదాపు ఏడెమిది సార్లు విన్న తర్వాత ఫైనల్ గా నాగార్జున సైమన్ రోల్ కి ఓకే చెప్పాడు. నాగార్జున మీద తనకున్న ఇష్టమంతా కూడా అతని ఓపెనింగ్ సీన్, ఎలివేషన్స్ లో చూపించాడు లోకేష్ కానీ ఆ రోల్ ని ఎండ్ చేసిన తీరు మాత్రం మెప్పించలేదు. రజనీ, నాగార్జున ఫేస్ ఆఫ్ సీన్స్ ఇంకా బలంగా ఉండాల్సింది. లేదా నాగార్జునకు చెప్పినట్టుగా లోకేష్ తీయలేదా అన్న డౌట్ కూడా వస్తుంది.
ఐతే నాగార్జున క్యారెక్టర్స్ ఛాయిస్ ఎప్పుడు ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిస్తుంది. మంచి దూకుడు మీద ఉన్న టైం లో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు చేసి షాక్ ఇచ్చాడు. ఊపిరి సినిమాలో వీల్ చెయిర్ లో ఉండి కూడా తన టాలెంట్ చూపించాడు నాగార్జున. సో ఎలాంటి పాత్రలో అయినా తనని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్న ధైర్యంతోనే నాగార్జున ఇలాంటి రిస్క్ లు చేస్తాడు. ఐతే కూలీలో సైమన్ రోల్ పూర్తిగా బ్యాడ్ గాయ్ పాత్ర. ఈ రోల్ చేసే టైం లో నాగార్జున నెక్స్ట్ తనని అందరు ఇలా విలన్ గానే తీసుకుంటే ఎలా అన్నది ఆలోచించాల్సింది.
విలన్ గా బెస్ట్ లెసన్..
ఎందుకంటే హీరో విలన్ గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారు కానీ విలన్ గా చేసిన ఎవరినైనా హీరోగా అంటే కాస్త టైం తీసుకుంటారు. అఫ్కోర్స్ నాగార్జునకు అలాంటి ప్రొబ్లెం ఉండదు కానీ కూలీ సినిమా నాగార్జునకు కూడా ఒక బెస్ట్ లెసన్ లా ఉపయోగపడుతుంది. లోకేష్ చేసిన ఖైదీ, విక్రం చూసి అతని సినిమాలో విలన్ రోల్ అయినా ఓకే అనుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ లు చూస్తే ఇక మీదట ఇలాంటివి చేయకపోతే బెటర్ అనే భావన వస్తుంది.
కుబేర, సైమన్ రోల్స్ తో సెకండ్ కెరీర్ చూజ్ చేసుకున్న నాగార్జునకు ఆ సినిమాల ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. సినిమాల కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా నాగార్జున చేసిన పాత్రలకు ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
