సైమన్ మిస్ 'ఫైర్'..?
కింగ్ నాగార్జున వర్సటాలిటీకి కేరాఫ్ అడ్రస్ గా మారారు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే డివోషనల్ సబ్జెక్ట్ తో సినిమాలు చేసి ఆడియన్స్ ని అలరించాడు నాగార్జున.
By: Ramesh Boddu | 15 Aug 2025 2:17 PM ISTకింగ్ నాగార్జున వర్సటాలిటీకి కేరాఫ్ అడ్రస్ గా మారారు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే డివోషనల్ సబ్జెక్ట్ తో సినిమాలు చేసి ఆడియన్స్ ని అలరించాడు నాగార్జున. ఇక ఇప్పుడు మరోసారి సపోర్టింగ్ రోల్, విలన్ రోల్స్ చేస్తూ షాక్ ఇస్తున్నారు నాగ్. కుబేర సినిమాలో దీపక్ రోల్ లో నాగార్జున సర్ ప్రైజ్ చేశారు. శేఖర్ కమ్ముల ఎలా నాగార్జునని ఆ రోల్ కి ఒప్పించారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యింది. ఐతే ఆ రోల్ వేరే వాళ్లు చేస్తే జస్ట్ ఒక మంచి రోల్ అయ్యేది కానీ నాగార్జున లాంటి స్టార్ చేశాడు కాబట్టే కుబేరకు అది హెల్ప్ అయ్యింది.
సైమన్ పాత్రలో నాగార్జున షాక్..
ఇక అదే తరహాలో కూలీ సినిమాలో సైమన్ పాత్రలో నాగార్జున షాక్ ఇచ్చాడు. లోకేష్ ఈ రోల్ లో నాగార్జునని ఒప్పించాలని దాదాపు ఏడెనిమిది సార్లు నాగార్జునకి కథ చెప్పారట. ఫైనల్ వెర్షన్ నాగార్జునని సాటిస్ఫై చేసింది. ఐతే సైమన్ రోల్ లో నాగార్జున స్టైల్ అదిరిపోయింది. కానీ సినిమా చూసిన అక్కినేని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
సినిమాలో నాగార్జునని ఎంత రేంజ్ కి లేపారో సెకండ్ హాఫ్ అసలు ఆ రేంజ్ కంక్లూజన్ ఇవ్వలేదు. రజనీ, నాగార్జున ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా సరిగ్గా పండలేదు. నాగార్జున వరకు ఈ విలన్ రోల్ ఎంజాయ్ చేస్తూ చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశ చెందారు. అదీగాక కూలీ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ని లోకేష్ సరిగా వాడుకోలేదు. ఆ ఇంపాక్ట్ కూడా కూలీ రిజల్ట్ మీద పడింది.
సోలో హీరోగా సినిమా చేస్తే ఫ్యాన్స్ సాటిస్ఫై..
నాగార్జున సైమన్ రోల్ ఫైరా.. మిస్ ఫైరా అన్నది పక్కన పెడితే ఈ సినిమాతో నాగార్జున ఇక మీదట ఇలాంటి రోల్స్ జోలికి వెళ్లకపోతే బెటర్ అనే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సోలో హీరోగా సినిమా చేస్తే ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. ఒకవేళ మరీ అంతగా చేయాలని ఉంటే మల్టీస్టారర్ సినిమాలు చేయొచ్చు అంతేకానీ ఇలా సాక్రిఫైజ్ రోల్స్, విలన్ రోల్స్ వద్దే వద్దని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
మరి నాగార్జున వారి రిక్వెస్ట్ లను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటాడన్నది చూడాలి. నాగార్జున దీపక్, సైమన్ రోల్స్ వెరైటీగా అనిపించినా ఆయన స్టార్ డం కి అవి సూటవ్వలేదన్న మాట మాత్రం వాస్తవం. నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున సోలో సినిమా ఏది ఫైనల్ చేయలేదు. మరోపక్క సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 వస్తుంది. మరి నెక్స్ట్ నాగ్ అటెంప్ట్ ఏంటన్నది చూడాలి.
