Begin typing your search above and press return to search.

చై-అఖిల్‌కి ఆ ధైర్యం లేదు: నాగ్

ఇదే వేదిక‌పై చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్జీవీకి కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదురయ్యాయి. మ‌రోసారి నాగార్జునతో కలిసి పనిచేస్తారా?

By:  Sivaji Kontham   |   11 Nov 2025 5:00 AM IST
చై-అఖిల్‌కి ఆ ధైర్యం లేదు: నాగ్
X

ఆర్జీవీ తెర‌కెక్కించిన క‌ల్ట్ క్లాసిక్ `శివ` దాదాపు 36 ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లో రీరిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 4కేలో రీమాస్ట‌ర్ చేసిన వెర్ష‌న్ ను డాల్బీ సౌండ్ తో సినిమా న‌వంబ‌ర్ 14న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ప్రీమియ‌ర్ వీక్షించిన త‌రవాత‌ దీనికి అద్భుత స్పంద‌న‌లు వ‌స్తున్నాయ‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

ప్ర‌త్యేక ప్రీమియ‌ర్ వీక్షించిన నాగార్జున‌కు మూడు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. వీటిలో నాగ‌చైత‌న్య, అఖిల్ ఈ సినిమాను ఎప్పుడైనా రీమేక్ చేయాల‌ని అనుకున్నారా? అని ప్ర‌శ్నించ‌గానే, అందుకు వారికి ధైర్యం లేద‌ని నాగార్జున న‌వ్వేసారు. ఈ సినిమాను త‌న‌కు ఇచ్చిన ఆర్జీవీకి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇది లైఫ్ లో ఒకసారి మాత్ర‌మే ఎదుర‌య్యే అనుభ‌వం. నాన్న (ఏఎన్నార్) గారు ఈ సినిమా చూసిన రెండు రోజుల త‌ర్వాత న‌న్ను డ్రైవ్ కి తీసుకెళ్లి సినిమా పెద్ద హిట్! అని అన్నారు... అని తెలిపారు. సినిమా చూసాక ర‌క‌ర‌కాల కామెంట్లు విన్నాన‌ని నాగ్ నాటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. రీమాస్ట‌ర్ వెర్ష‌న్ చూసాక మ‌ళ్లీ కొత్త సినిమా చూస్తున్నానా? అన్న ఫీలింగ్ క‌లిగింద‌ని నాగ్ అన్నారు.

ఇదే వేదిక‌పై చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్జీవీకి కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదురయ్యాయి. మ‌రోసారి నాగార్జునతో కలిసి పనిచేస్తారా? అని ప్ర‌శ్నించ‌గా.. నేను మరొక సినిమా కోసం నాగార్జునను సంప్రదించాలంటే, హిట్ ఇచ్చిన తర్వాతే అలా చేస్తానని అన్నారు.

90ల‌లో శివ ట్రెండ్ సెట్ట‌ర్ మూవీగా నిల‌వ‌డంలో ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో పాటు, నాగార్జున‌, ర‌ఘువ‌ర‌ణ్ ల న‌ట‌న‌, ఇళ‌య‌రాజా మ్యూజిక్ క‌లిసొచ్చాయి. త‌న తొలి సినిమాతోనే ఆర్జీవీ మ్యాజిక్ మొద‌లైంది. ఈ సినిమాలో సైకిల్ చైన్ సీన్ ని నాగార్జున‌తో ఎలా చేయించానో ... దానిని ఎలా అంగీక‌రించాడో ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ఆర్జీవీ అన్నాడు. శివ చిత్రం నాగార్జున‌కు అంకితం అని అన్నారు. నేను రాత్రి అనే చిన్న సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు నాగార్జున కోసం క‌థ రాయ‌మ‌న్నారు నిర్మాత వెంక‌ట్. అప్ప‌టికి నేను బ్రూస్ లీ `రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్` చిత్రాన్ని 50వ సారి చూసాను. ఆయ‌న‌కు అంత‌టి అభిమానిని.. ఆ సినిమాలో రెస్టారెంట్ బ్యాక్ డ్రాప్ ని శివ కోసం కాలేజీ నేప‌థ్యంలో ఉప‌యోగించాన‌ని వ‌ర్మ తెలిపారు. నా కాలేజీ అనుభ‌వాల‌న్నిటినీ క‌లిపి 20నిమిషాల్లోనే వ‌న్ లైన్ తో రెడీ అయ్యాన‌ని తెలిపారు.