'శివ' స్టోరీ...సైకిల్ చైన్ ఎలా వచ్చిందంటే?
కోపంతో వాడు మరికొంత మందిని వెనకేసుకుని వస్తాడు. వాళ్లనీ బ్రూస్ లీ తన్తాడు. అదే కథను `శివ`గా మలిచాను. అందులో రెస్టారెంట్ తీసేసి కాలేజ్ బ్యాక్ డ్రాప్ పెట్టాను.
By: Srikanth Kontham | 11 Nov 2025 5:29 PM ISTఈ మధ్య కాలంలో ఏ సినిమా రీ-రిలీజ్ కు జరగని ప్రచారం కల్ట్ క్లాసిక్ హిట్ `శివ`కు జరుగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 36 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోన్న చిత్రం కావడంతో? స్టార్లు అంతా ముందుకొచ్చి ప్రచారం చేయడంతో మంచి బజ్ నెలకొంది. రీ-రిలీజ్ సినిమాల్లో ఇంత వరకూ ఏ సినిమాకు ఇంత బజ్ నెలకొనలేదు. ఆ రకంగా `శివ` గ్రాండ్ సక్సస్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో మూడు రోజుల్లో సినిమా బిగ్ స్క్రీన్ లోకి రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
4కె ఫార్మెట్ లో సినిమా ఎలా ఉండబోతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ జనరేషన్ యువతకి `శివ` ఎంత వరకూ కనెక్ట్ అవుతుందో తెలియదు గానీ..నాటి తరం `శివ` అభిమానులు మాత్రం మరోసారి థియేటర్లో చూడాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అక్కినేని అభిమానులు రీ-రిలీజ్ లోనూ రికార్డుల మోత మ్రోగింస్తుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా `శివ` గురించి మరిన్ని విషయాలు రామ్-నాగ్ మాటల్లో బయట పడ్డాయి. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే..`శివ` కథకు ఎలా బీజం పడిందంటే? వర్మ ఆసక్తిర విషయం పంచుకున్నారు.
నాగ్ తో హారర్ సినిమా అనుకున్నా:
`శివ` స్టోరీ ఐడియాకు బ్రూస్ లీ కారణం. `రాత్రి` సినిమా చేస్తోన్న సమయం అది. అప్పుడే నాగార్జునతో ఓ హారర్ సినిమా చేస్తే ఎలా? ఉంటుందని ఆలోచిస్తున్నా? ఇదే విషయాన్ని అక్కినేని వెంకట్ దృష్టితో తీసుకెళ్తే నాగ్ తో కొత్తగా ఎందుకు ట్రై చేయకూడదన్నారు. ఆ ముందు రోజు బ్రూస్ లీ నటించిన `ఎంటర్ ది డ్రాగన్` చూడటం 15వ సారి. అందులో ఓ రెస్టారెంట్ ఫైట్ ఉంటుంది. అక్కడ అమ్మాయిని అల్లరి చేసిన ఒకడిని బ్రూస్ లీ కొడతాడు.
రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా:
కోపంతో వాడు మరికొంత మందిని వెనకేసుకుని వస్తాడు. వాళ్లనీ బ్రూస్ లీ తన్తాడు. అదే కథను `శివ`గా మలిచాను. అందులో రెస్టారెంట్ తీసేసి కాలేజ్ బ్యాక్ డ్రాప్ పెట్టాను. ఆ కథకు నా కాలేజ్ అనుభవాలు జోడించాను. కొత్త పాత్రలను యాడ్ చేసాను. ఆ కథలో మార్షల్ ఆర్స్ట్ ఉంటుంది. దాన్ని తేసిసా సాధారణ యాక్షన్ సన్నివేశాలు పెట్టానన్నారు. అలాగే సైకిల్ చైన్ ఐడియా ఎలా వచ్చిందంటే? ఆ సినిమాలో నాగార్జున చదువుకునే స్టూడెంట్. అతన్ని కొట్టడానికి రౌడీలు ఇంటెన్షన్ గా వస్తారు. కాబట్టే వాళ్ల దగ్గర రాడ్లు..కర్రలు ఉంటాయి.
సైకిల్ చైన్ అలా వచ్చింది:
కానీ అప్పుడు శివ చేతిలో ఎలాంటి వెపన్ ఉండదు. ఆ సమయంలో అక్కడ కళ్లకు ఎదురుగా కనిపించేది సైకిల్ చైన్ మాత్రమే. దీంతో ఆ చైన్ తెంపి తన వెపన్ గా మార్చుకుంటాడు. తొలి పంచ్ తర్వాతే శివ చైన్ తెంపే సీన్ ఉంటుం దన్నారు. అలాగే నానాజీతో త్రీ పంచ్ సీన్ ఉంటుంది. అక్కడ శివ.. నానాజీని భవానీ ఎక్కడ అని అడు గుతాడు. దానికి ముందే శివను కొట్టడానికి ముగ్గురు ముందుకొస్తారు. వాళ్ల ముగ్గుర్ని కొడతాడు. సినిమాల్లో అప్పటి వరకూ అలాంటి యాక్షన్ పంచ్ సీన్ లేదు. దీంతో అది కొత్తగా హైలైట్ అయింది. ఆ సీన్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే చాలా అద్భుతంగా వచ్చిందన్నారు.
