శివ జ్ఞాపకాలు అతిగా బాధించేవి ఉన్నాయి: నాగార్జున
ఇటీవల ప్రత్యేక షో వీక్షించిన నాగ్- ఆర్జీవీ విలేకరులతో మాట్లాడుతూ అత్యద్భుత సాంకేతికత, సౌండ్ క్వాలిటీతో శివ చిత్రాన్ని రీరిలీజ్ చేయడంతో స్పందనలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.
By: Sivaji Kontham | 10 Nov 2025 9:48 PM ISTకల్ట్ క్లాసిక్ `శివ` దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత థియేటర్లలోకి తిరిగి వస్తోంది. మొదటి విడుదల తర్వాత, 36 సంవత్సరాలకు ఈ సినిమాను 4కేలో రీమాస్టర్ చేసి డాల్బీ అట్మాస్ సౌండ్‌తో తిరిగి విడుదల చేయడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. శివ నవంబర్ 14న థియేటర్లలోకి విడుదలవుతోంది. ఈ చిత్రంలో నాగ్ సరసన అమల కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. శుభలేఖ సుధాకర్, రఘువరన్ తదితరులు నటించారు.
ఇటీవల ప్రత్యేక షో వీక్షించిన నాగ్- ఆర్జీవీ విలేకరులతో మాట్లాడుతూ అత్యద్భుత సాంకేతికత, సౌండ్ క్వాలిటీతో శివ చిత్రాన్ని రీరిలీజ్ చేయడంతో స్పందనలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల తాను 4కేలో సినిమా చూసినప్పుడు కొత్త సినిమా చూసిన అనుభూతి కలిగిందని నాగార్జున అన్నారు. ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిన సినిమా. మనసును కదిలించేవి .. అతిగా బాధించేవి ఉన్నాయని అన్నారు.
ఈ సినిమాలోని ఏ సన్నివేశాన్ని పునఃసృష్టించలేరని మళ్లీ షూట్ చేయలేనని ఇదే వేదికపై దర్శకుడు ఆర్జీవీ అంగీకరించారు. ఆ టేకింగ్ తనను కూడా మంత్రముగ్ధుడిని చేసిందని, డూప్‌లు లేకుండా ఇలాంటి రిస్కీ స్టంట్‌లు చేయమని నాగ్ ని ఎలా అడిగానో చూసి షాకవుతున్నానని ఆర్జీవీ అన్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా ఒరిజినల్ సంగీతానికి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నామని, ఏ మాత్రం మార్పు చేయలేదని తెలిపారు.
ఏఐ సహాయంతో మోనోట్రాక్‌ను మల్టీ-ట్రాక్‌గా మార్చామని నాగ్ -ఆర్‌జివి చెప్పారు. కొన్ని పాటలను తొలగించి, అభిమానుల కోసం చివర్లో జోడించామని తెలిపారు.
