నాగార్జున ఆహారపు అలవాట్లు తెలిస్తే షాక్.. ఊహించలేదుగా
ఇకపోతే అలా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఏడు పదుల వయసు వచ్చినా సరే ఇంకా యవ్వనంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో నాగార్జున కూడా ఒకరు.
By: Madhu Reddy | 15 Nov 2025 9:39 AM ISTసినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తమ నటనతోనే కాదు గ్లామర్ ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాస్త బరువు పెరిగినా లేదా కాస్త బరువు తగ్గినా అభిమానులు ఇట్టే పసిగట్టేసి ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయనే రేంజ్ లో కంగారుపడుతూ ఉంటారు. అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే ఉన్నారో.. మునుముందు కూడా అలాగే ఉండాలని కోరుకునే అభిమానులు కూడా లేకపోలేదు. అందుకే అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా సెలబ్రిటీలు కూడా తమ శరీరంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ.. వృద్ధాప్య వయసులో కూడా స్టిల్ యంగ్ అనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తూ అందరిని అబ్బుర పరుస్తూ ఉంటారు.
ఇకపోతే అలా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఏడు పదుల వయసు వచ్చినా సరే ఇంకా యవ్వనంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో నాగార్జున కూడా ఒకరు. నాగార్జున అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో సందేహం లేదు. అంతలా తన ఫిట్నెస్ తో అందరినీ ఆకట్టుకునే ఈయన ఏం తింటారు ? ఆయన డైట్ సీక్రెట్ ఏంటి? అని తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నాగార్జునకు స్వయంగా వండి పెట్టే ఒక వ్యక్తి నాగార్జున డైట్ సీక్రెట్ ను రివీల్ చేయడమే కాకుండా ఆయన ఎప్పుడు ఏం తింటారు? ఆయన ఆహారపు అలవాట్లు ఏంటి? అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.."నాగార్జునకు ప్రతిరోజు బెండకాయ తప్పనిసరిగా ఉండాలి. హాట్ చిప్స్ కచ్చితంగా ఉండాలి. ఇక అన్నం విషయానికి వస్తే.. ఆయన దంపుడు బియ్యం తింటారు. రసం, అరటి పండుతో పాటు మరో నాలుగు రకాల వంటలు కచ్చితంగా ఉండాలి. అయితే ఆయన అన్ని తింటారు. కానీ కేవలం కొద్ది మోతాదులో మాత్రమే తీసుకుంటారు. రైస్ విషయానికి వస్తే.. దంపుడు బియ్యంతో ముద్దలా చేయించుకొని మరీ తింటారు. ఆయనకు అలా తినడమే ఇష్టం. ఇక పాలిష్ చేసిన బియ్యాన్ని అసలుకే ముట్టుకోరు.
శనివారం వచ్చింది అంటే.. శనివారం నైట్ ఖచ్చితంగా పామ్ లెట్ ఫిష్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా కేరళ వంటి అవుట్ సైడ్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన అడిగి మరీ తయారు చేయించుకుంటారు. నేను చాలాసార్లు ఆయనకు అలా వండి పెట్టాను కూడా. ఆదివారం అయితే చికెన్ లేదా మటన్ కేవలం సగం కప్పు మాత్రమే తీసుకుంటారు" అంటూ ఆయన వివరించారు. ప్రస్తుతం నాగార్జున ఆహారపు అలవాట్లు గురించి విని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున అంత డైట్ ఫాలో అవుతారు కాబట్టి ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ గా ఉన్నారు.. అంతే ఆరోగ్యంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
