Begin typing your search above and press return to search.

శివ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శివ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

By:  Madhu Reddy   |   5 Nov 2025 9:00 PM IST
శివ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
X

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శివ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పటివరకు ఒక మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమాను శివ సినిమాతో రాంగోపాల్ వర్మ ఒక మలుపు తిప్పాడు. శివ సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ రూల్స్ బ్రేక్ చేశాడు అని అందరూ అంటున్నారు. కానీ వాస్తవానికి శివ సినిమా చేసినప్పటికీ రామ్ గోపాల్ వర్మకి అసలు రూల్స్ తెలియవు. అలా రూల్స్ తెలియకపోవడం వలన సినిమా చాలా బాగా వచ్చింది అని రాంగోపాల్ వర్మ పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు.

గతంలో రామ్ గోపాల్ వర్మ గురించి చాలామంది దర్శకులు మాట్లాడారు. శివ సినిమాతో వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. ఇప్పుడున్న టాప్ దర్శకులు అంతా కూడా ఒకప్పుడు రాంగోపాల్ వర్మ వర్క్ చూసి ఫిదా అయిపోయిన వాళ్ళే. శివ సినిమాలో అన్నీ కూడా నేచురల్ గా ఉండటం అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.

శివ సినిమా ముందు వరకు కొన్ని సినిమాల్లో ఫైట్లు చూస్తే హాస్యాస్పదంగా ఉండేవి. హీరో ఒకటి కొట్టగానే చుట్టూ ఉన్న విలన్లు చాలా దూరం ఎగిరిపోయే వాళ్ళు. అంతేకాకుండా హీరో విలన్ ని కొడుతున్నప్పుడు ఒక రకమైన సౌండ్స్ కూడా వచ్చేవి.

కానీ శివ సినిమా వచ్చిన తర్వాత సౌండ్ డిజైన్ ప్రత్యేకత ఏంటో అందరికీ అర్థమైంది. హీరో విలన్ ను కొట్టినప్పుడు కూడా ఆ సౌండింగ్ చాలా కొత్తగా అనిపించేది. అందుకే ఇప్పటికీ శివ సినిమా చూసిన ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. కేవలం అది మాత్రమే కాకుండా హీరో క్యారెక్టర్రైజేషన్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశాడు రాంగోపాల్ వర్మ.

ఒక సందర్భంలో నాగార్జున ప్రిన్సిపాల్ తో మాట్లాడే టైం లో ఎక్కువ జిమిక్స్ చేయకుండా కేవలం నాగార్జునకి క్లోజ్ షాట్ పెట్టి ఫినిష్ చేశాను అని చెప్పాడు. నన్ను కొట్టగానే రెండో చెంప చూపించడానికి నేనేమి గాంధీ మహాత్ముని కాదు అని నాగార్జున డైలాగ్ చాలా ఆర్ధత తో చెప్పారు. అప్పుడు మనం కెమెరా పక్కకి తిప్పితే అక్కడ ఉన్న ఫీలింగ్ పోతుంది అందుకనే నాగార్జున ఫేస్ మీద ఎక్కువ సేపు కెమెరా ఉంచాం అని చెప్పారు. ఇలాంటి ఉదాహరణలు శివ సినిమాకి సంబంధించి ఎన్నో ఉన్నాయి. అందుకే ఆ సినిమా అప్పుడు అంత బాగా వర్క్ అవుట్ అయింది.

మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శివ సినిమా చూస్తున్న తరుణంలో అప్పటికి అది కొత్తది ఇప్పుడు టెక్నికల్ గా చాలా మార్పులు జరిగిపోయాయి. కాబట్టి, మళ్లీ శివ సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా అని అందరికీ ఉన్న డౌట్. అయితే శివ సినిమాకి సంబంధించి చాలా కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి హైప్ ఇచ్చింది. అప్పుడు సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.