Begin typing your search above and press return to search.

నాగార్జునని చూసి రజినీ షాకైన వేళ..!

ఈ ఈవెంట్ లో కింగ్ నాగార్జున, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, హీరోయిన్ శృతి హాసన్, సత్యరాజ్ పాల్గొన్నారు. ఈ సినిమాలో తాను విలన్ గా చేయడానికి రీజన్స్ చెప్పారు నాగార్జున.

By:  Ramesh Boddu   |   4 Aug 2025 2:48 PM IST
నాగార్జునని చూసి రజినీ షాకైన వేళ..!
X

సూపర్ స్టార్ రజినీకాత్ లీడ్ రోల్ లో కింగ్ నాగార్జున ప్రతినాయకుడిగా వస్తున్న సినిమా కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్ లో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఆగష్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ప్రెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో కింగ్ నాగార్జున, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, హీరోయిన్ శృతి హాసన్, సత్యరాజ్ పాల్గొన్నారు. ఈ సినిమాలో తాను విలన్ గా చేయడానికి రీజన్స్ చెప్పారు నాగార్జున.

లోకేష్ డైరెక్షన్ లో సినిమా చేయాలని..

లోకేష్ కథ చెప్పినప్పుడు తాను చెప్పిన మార్పులను చేయాలని అడిగాను.. లోకేష్ అలానే 6, 7 సార్లు తిరిగి తాను చెప్పిన ఛేంజెస్ చేసి మళ్లీ వచ్చాడు. అలా తను చెప్పినట్టు చేశాడు కాబట్టే ఈ సినిమా చేశాను. అంతేకాదు అతను చేసిన ఖైదీ, విక్రం సినిమాలు చూసి అతని డైరెక్షన్ లో సినిమా చేయాలని అనుకున్నా. తను అనుకున్నానో లేదో కూలీ కథతో తన దగ్గరకు వచ్చాడని అన్నారు నాగార్జున.

మన దేశంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో లోకేష్ ఒకడు. అతని టాలెంట్ మాత్రమే కాదు మంచి మనసున్న వాడు. సెట్ లో ప్రతి ఒక్కరి మీద తన ఎంపతీ చూపిస్తాడు. ఈ సినిమాను 6 కెమెరాలతో షూట్ చేశారు. అవుట్ పుట్ చూశాక ఏంటి ఇదంతా మనమే చేశామా అన్నట్టు ఉంది. ఇక రజినీతో ఈ సినిమాతో కలిసి పనిచేశాం.

18 రోజుల షిప్ షూటింగ్..

ఆయన ఫస్ట్ నా గెటప్ చూసే ఇలా ఉంటాడనుకుంటే అసలు వద్దనే వాడినని అన్నారు. ఆయనతో కలిసి ఈ సినిమా జర్నీలో చాలా విషయాలు చర్చించాం. ఆయన తన అనుభవాలన్నీ చెప్పారు. అంతేకాదు 18 రోజుల షిప్ షూటింగ్ లో వెళ్తూ వెళ్తూ యూనిట్ కి ప్యాకెట్స్ ఇచ్చి ఇంట్లో వాళ్లకు ఏదైనా కొనుక్కోండని ఇచ్చారు. అది ఆయన మంచి మనసు అన్నారు నాగార్జున.

ఈ సినిమా కొన్ని సీన్స్ చేసిన తర్వాత లోకేష్ తో ఇంత ఎవిల్ గా ఉంటారా అంటే.. లోకేష్ దీని కన్నా ఇంకా ఎక్కువ ఉంటారని అన్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ మంచి రోల్ చేసింది. సౌబిన్, సత్యరాజ్ లు డాన్స్ లు వేశారు. తాను నిన్నే పెళ్లాడతా చేసిన తర్వాత అన్నమయ్య చేస్తుంటే చాలామంది డిస్ కరేజ్ చేశారు. కానీ తాను ప్రయోగాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. కూలీ సినిమాలో తనని ప్రతినాయకుడిగా చూస్తారు. రజినీ నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. లోకేష్ తో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని కూలీ సినిమా చూడాలని అన్నారు నాగార్జున.