Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 10 హోస్ట్ ఎవరో ఫైనల్ లో హింట్..?

బిగ్ బాస్ సీజన్ 3 నుంచి దాదాపు ఆరు సీజన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ తెలుగు రన్ అవుతుంది.

By:  Ramesh Boddu   |   25 Nov 2025 4:00 PM IST
బిగ్ బాస్ 10 హోస్ట్ ఎవరో ఫైనల్ లో హింట్..?
X

బిగ్ బాస్ సీజన్ 9 మరో నాలుగు వారాల్లో పూర్తి అవుతుంది. ప్రస్తుతం 12 వ వారం కొనసాగుతున్న ఈ సీజన్ బిగ్ బాస్ నెక్స్ట్ వారాల్లో ఇక టాప్ 5ని ఎంపిక చేయడం మరికొన్ని టాస్క్ లు పెట్టడం జరుగుతుంది. టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా నెక్స్ట్ వీక్ జరిగే ఛాన్స్ ఉంది. ఐతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పూర్తి కాబోతున్న ఈ టైంలో సీజన్ 10 గురించి ఒక న్యూస్ ఇప్పటికే వైరల్ అయ్యింది. అదేంటి అంటే బిగ్ బాస్ సీజన్ 10 అన్నపూర్ణ స్టూడియోలో కాకుండా బిగ్ బాస్ టీం వేరే చోట సొంత బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నారట.. అందులోనే సీజన్ 10 ఉంటుందని అంటున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున..

బిగ్ బాస్ సీజన్ 3 నుంచి దాదాపు ఆరు సీజన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ తెలుగు రన్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే కాబట్టి హోస్ట్ గా నాగార్జున చేస్తున్నారు. సీజన్ 3 నుంచి సీజన్ 9 మొత్తం 6 ఒక నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ అంటే 7 సీజన్లుగా నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 10 అన్నపూర్ణ స్టూడియోలో కాకుండా వేరే చోట అయితే నాగార్జున హోస్ట్ గా కొనసాగే ఛాన్స్ లేదని అంటున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో కాబట్టి నాగార్జున చక చకా చేసేస్తున్నారు కానీ వేరే ఎక్కడైనా అంటే మాత్రం అతనికు కుదిరే ఛాన్స్ లేదు. ఇక బిగ్ బాస్ తెలుగు కొత్త హోస్ట్ ఎవరన్నది క్లారిటీ రాలేదు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ కి ఒక స్టార్ ని గెస్ట్ గా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఆయనే బిగ్ బాస్ 10కి హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

రానా, వెంకటేష్ స్టార్స్ పేర్లు..

బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదట్లో హోస్ట్ విషయంపై డిస్కషన్ జరుగుతుంది. ఐతే ఈసారి మాత్రం సీజన్ 10కి నాగార్జున కాకుండా మరో స్టార్ హోస్ట్ గా ఉంటారని తెలుస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ గా రానా, వెంకటేష్ లాంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. ఐతే వారిలో ఎవరైనా సీజన్ 10 హోస్ట్ చేస్తారా లేదా కొత్త స్టార్ ని పట్టేస్తారా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ కి ఎవరు వస్తారు.. ఎవరిని తీసుకొస్తారు అన్నది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 10 ప్లేస్ ఛేంజ్ అయితే మాత్రం బిగ్ బాస్ లీక్స్ కి ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. బిగ్ బాస్ టీం మొత్తం కొత్త వారితో నాన్ తెలుగు టెక్నిషియన్స్ తో సీజన్ 10 ప్లాన్ చేస్తున్నారట. లోకల్ టెక్నిషియన్స్ వల్లే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి చాలా బాగా లీక్స్ వస్తున్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.