మణిరత్నం వెంట పడిన నాగార్జున!
నాగార్జున- గిరిజ జంటగా మణిరత్నం తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ చిత్రం `గీతాంజలి` అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 18 Aug 2025 4:00 PM ISTనాగార్జున- గిరిజ జంటగా మణిరత్నం తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ చిత్రం `గీతాంజలి` అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్ డ్రామాకి ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు. నాగార్జున కెరీర్లో ఓ గొప్ప చిత్రంగా నిలిచింది. అప్పటి వరకూ తెలుగు సినిమాలు చేయని మణిరత్నం `గీతాంజలి`తోనే టాలీ వుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే? మణిరత్నం అంటే తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గర య్యారు. అప్పటికే తమిళ్ లో ఆరేడు సినిమాలు చేసిన మణిరత్నం కెరీర్ కి ఈ సినిమాతో ఎంతో కీలకంగా మారింది.
మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా సాధ్యమైంది? అన్నది మాత్రం ఇంత వరకూ ఎక్కడా బయట పడలేదు. తాజాగా ఈ విషయాన్ని రివీల్ చేసి ప్రేక్షకాభిమానుల్ని సర్ ప్రైజ్ చేసారు. మణిరత్నంతో సినిమా కోసం పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాను అప్పటికే ఓ పెద్ద స్టార్ కుమారుడు అన్న సంగతి సైతం పక్కన బెట్టి మరీ మణిరత్నంని సాధించారని తెలుస్తోంది. మణిరత్నం తీసిన `మౌనరాగం` సినిమా చూసిన తర్వాత నాగార్జున ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని బలంగా సంకల్పించారు.
దీంతో మణిరత్నం ఉదయం లేచిన తర్వాత ఎక్కడ వాకింగ్ చేస్తున్నారో? తెలుసుకుని అక్కడికి నాగ్ వెళ్లేవారు. దాదాపు నెల రోజుల పాటు ఇలా వెంబడించడమే పనిగా పెట్టుకుకున్నారు నాగ్. అలా మణి రత్నం దృష్టిలో నాగ్ పడటం `గీతాంజలి` పట్టాలెక్కడం జరిగింది. అయితే తొలుత ఈ సినిమాను తమి ళంలోనే తీయాలనుకున్నారుట. కానీ నాగార్జున తెలుగులో చేయాలని పట్టు బట్టడంతో మణిరత్నం కాదనలేక అంగీకరించినట్లు తెలిపారు.
ఏఎన్నార్ వారసుడిగా తెరంగేట్రం చేసిన నాగార్జున అప్పటికే పెద్ద స్టార్. ఏఎన్నార్ కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగార్జునకు చాలా కమిట్ మెంట్లు ఉన్నాయి. అయినా మణిరత్నంతో సినిమా చేయాలని తన స్టార్ డమ్ పక్కన బెట్టి మణిరత్నంతో పని చేయాలని కసిగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. నాగ్ నమ్మకాన్ని నిలబెడుతూ గొప్ప విజయాన్ని ఆయన కెరీర్ కి అందించారు మణిసార్.
