ఆ దేశంలో 'మనం' మనసులు గెలుస్తుందా..?
జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఒక సూపర్ హిట్ సినిమా జపాన్ లో రిలీజ్ అవుతుంది.
By: Ramesh Boddu | 2 Aug 2025 7:28 PM ISTఈమధ్య తెలుగు సినిమాలకు ఇతర దేశాల్లో మంచి ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఇండియన్ సినిమాలు ఇతర దేశాల్లో వారి భాషల్లో రిలీజ్ అవ్వడం కామన్ అయ్యింది. ఒకప్పుడు ఏదో ఒక సినిమా అలా రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు స్టార్ సినిమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు అన్ని దేశాల్లో వారి వారి భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ లో ఇండియన్ సినిమాలు భారీ రిలీజ్ అవుతున్నాయి. సౌత్ సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది.
సూపర్ హిట్ సినిమా జపాన్ లో రిలీజ్..
జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఒక సూపర్ హిట్ సినిమా జపాన్ లో రిలీజ్ అవుతుంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా నటించిన సినిమా మనం. ఏఎన్నార్ నటించిన చివరి సినిమా కూడా అదే. ఆ సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తన ఫ్యామిలీ సినిమా అని అందుకే ఆ సినిమా రీమేక్ రైట్స్ ని ఎవరికీ అమ్మలేదు నాగార్జున.
ఐతే ఈ సినిమా రిలీజైన ఇన్నేళ్ల తర్వాత జపాన్ లో ఇది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. జపనీస్ భాషలోనే మనం సినిమా రిలీజ్ కాబోతుంది. ఆగష్టు 8న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున అక్కడ ఫ్యాన్స్ ని గ్రీట్ చేయబోతున్నారు. ఐతే నాగార్జున డైరెక్ట్ గా కాకుండా వర్చువల్ గా అంటే వీడియో కాల్ ద్వారా అక్కడ ఫ్యాన్స్ ని గ్రీట్ చేయబోతున్నారు.
అక్కినేని ఫ్యామిలీకి బాగా సెట్ అయిన కథ..
మనం సినిమా ఒక మూడు తరాల కథ. అక్కినేని ఫ్యామిలీకి బాగా సెట్ అయిన కథ. ఐతే ఈ ఎమోషనల్ సినిమాను జపనీస్ ని కూడా అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో ఏయన్నార్ తో పాటు నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రీయ, అఖిల్ కూడా క్యామియో రోల్ లో నటించారు. అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా కలిసి చేసిన సినిమా మనం.
ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమాను విక్రం కుమార్ డైరెక్ట్ చేశారు. 2014 లో వచ్చిన ఈ సినిమా మళ్లీ 11 ఏళ్ల తర్వాత జపాన్ లో రిలీజ్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తుంది. మరి జపనీస్
