నాగార్జున 'కింగ్ 100' ఇంటర్వెల్ అలా ప్లాన్ చేశారా?
ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'కింగ్ 100' మూవీని ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసే విధంగా మలచాలనే ఉద్దేశ్యంతోనే నాగార్జున ఉన్నాడు.
By: Gopi Velupala | 10 Oct 2026 8:00 PM ISTఅక్కినేని ఫ్యామిలీ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున...చాలా తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోగా ఎదిగాడు. 'శివ' సినిమాతో మాస్ ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో ఒకరిగా మారాడు. వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాడు. అందుకే ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించాడు...ప్రస్తుతం రా కార్తిక్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 'కింగ్ 100' పేరుతో తన వందో సినిమా ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మీదనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టాడు...
అక్కినేని హీరోల ఎంట్రీ ఉండబోతుందా...
ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'కింగ్ 100' మూవీని ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసే విధంగా మలచాలనే ఉద్దేశ్యంతోనే నాగార్జున ఉన్నాడు. ఈ సినిమాతో నాగార్జున తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈమధ్య కాలంలో నాగార్జున కూలీ, కుబేర సినిమాల్లో నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. నాగ్ హీరోగా చేసిన 'నా సామి రంగా' సినిమా రిలీజై మూడు సంవత్సరాల పైనే అవుతుంది. ఇప్పుడు 'కింగ్ 100' మూవీ ఆయన అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతోంది. సినిమా ఇంటర్వెల్లో అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా కనిపించబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
'కింగ్ 100' మరో 'మనం ' అవుతుందా...
'మనం' సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరోలందరు కనిపించారు. ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచింది. కింగ్ 100 నాగార్జున వందో సినిమా కాబట్టి ఈ సినిమాలో కూడా అక్కినేని ఫ్యామిలీ కనిపిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే నాగచైతన్య, అఖిల్ ను ఇందులో మిళితం చేస్తూ ఒక సన్నివేశాన్ని కూడా క్రియేట్ చేశారట. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ఇంటర్వెల్ లో వచ్చే ఈ సన్నివేశం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. నాగార్జున ఏది చేసినా కూడా దానికి పర్ఫెక్ట్ రీజన్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో ఇంటర్వెల్ ని ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నింటికంటే భిన్నంగా మలుస్తున్నారట. నాగచైతన్య, అఖిల్ సినిమాలో కనిపించడానికి ఒక ప్రాపర్ రీజన్ ని కూడా సెట్ చేశారట. ఇతర సినిమాల్లో మాదిరిగా క్యామియో రోల్ పోషించినట్టుగా కాకుండా కథలో భాగంగానే వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఫైట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఒక రకంగా చెప్పాలి అంటే ఇంటర్వెల్లో అక్కినేని హీరోలు ముగ్గురు కలిసి ఫైటింగ్ చేస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. రీసెంట్ గా 'లెనిన్' సినిమాతో అఖిల్ సైతం హిట్ ట్రాక్ ఎక్కాడు. నాగచైతన్య 'వృషకర్మ' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు... నిజంగానే కింగ్ 100 సినిమాలో వీళ్లు కనిపిస్తే సినిమా రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని కొంతమంది సినీ విశ్లేషకులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు...
