Begin typing your search above and press return to search.

కింగ్ 100.. ఈ ఇద్దరూ కూడానా?

రా కార్తీక్ డెబ్యూ మూవీ యావరేజ్ హిట్ గా నిలిచినప్పటికీ.. తన టాలెంట్ తో మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

By:  M Prashanth   |   18 Sept 2025 1:38 PM IST
కింగ్ 100.. ఈ ఇద్దరూ కూడానా?
X

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. ఇప్పుడు తన కెరీర్‌లో వందో చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ల్యాండ్ మార్క్ మూవీ కోసం కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ తో జతకట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒకే ఒక్క మూవీ చేసిన డైరెక్టర్ తో నాగార్జున చేతులు కలపడం విశేషం.

రా కార్తీక్ డెబ్యూ మూవీ యావరేజ్ హిట్ గా నిలిచినప్పటికీ.. తన టాలెంట్ తో మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు కథ చెప్పిన శైలికి నాగార్జున ఫ్లాట్ అయ్యారు. స్క్రిప్ట్ పట్ల ముగ్ధుడయ్యారు. నమ్మకంతో మంచి ఛాన్స్ ఇచ్చారు. కొన్ని నెలలపాటు చర్చలు జరగ్గా.. రీసెంట్ గా ప్రాజెక్ట్ లాక్ అయింది.

యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో నాగ్ రిస్క్ తీసుకోవడం లేదని, బలమైన కథను ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను తన సొంత అన్నపూర్ణ స్టూడియోస్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మూవీకి 100 నాటౌట్ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు.

అయితే ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినిమా అధికారిక ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కానీ ఏమైందో తెలియదు. అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ల్యాండ్ మార్క్ మూవీ లాంచింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు నాగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. నాగార్జున కొడుకులు, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ సినిమాలో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది.

నాగ్ 100వ చిత్రంలో ఇద్దరు యంగ్ హీరోలు క్యామియో రోల్స్ పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. తండ్రి ల్యాండ్ మార్క్ మూవీలో నటించేందుకు ఓకే కూడా చెప్పారని.. ఆసక్తితో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే నాగ్, చైతూ, అఖిల్ ఇప్పటికే మనం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కింగ్ 100 ప్రాజెక్ట్ లో కలిసి సందడి చేయనున్నారు.