నాగార్జునను అంత మాట అనేసిన జగపతిబాబు.. ఊహించలేదుగా
జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి ఫస్ట్ గెస్ట్ గా అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.
By: Madhu Reddy | 17 Aug 2025 1:00 AM ISTజగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి ఫస్ట్ గెస్ట్ గా అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఈ షో నుండి వచ్చిన ప్రోమోలు షోకి భారీ హైప్ ని తెచ్చి పెట్టాయి. అయితే ఈ షోకి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 17న రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది.. అయితే ఈ షోకి సంబంధించిన ఎన్నో ప్రోమోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అలాంటి ఒక వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి నాగార్జునని జగపతిబాబు అంత మాట అన్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు..మరి ఇంతకీ నాగార్జునను జగపతిబాబు ఏమన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జగపతిబాబు, నాగార్జున ఇద్దరూ మంచి స్నేహితులట. సినిమాల్లోకి రాకముందు నుండే జగపతిబాబుకి నాగార్జున తెలుసట. అలా వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలాగే జగ్గూ భాయ్ సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ కూడా నాగార్జుననే అని, ఆయన్ని చూసే నేను హీరో అవ్వాలని ఇన్స్పైర్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ షోలో తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ అడిగేసారు జగపతి బాబు. ఇందులో భాగంగా చిన్నా చితకా పాత్రలు చేస్తూ నేను ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. కానీ నువ్వు ఎందుకు కూలీ మూవీలో విలన్ గా చేసావు అంటూ ప్రశ్న అడగడంతో షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు నాగార్జున.ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలి అనేది వాడి నుదుటిపై రాసి ఉంటుంది.. అంటూ మాట్లాడడంతో నాగ్ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అలాగే నాగార్జున కొడుకు అఖిల్ రాబోయే లేటెస్ట్ మూవీ లో ఓ చిన్న పాత్ర కోసం జగపతిబాబుని అడిగారట. అయితే ఇదే విషయాన్ని జగపతిబాబు నాగార్జునని అడుగుతూ.. అఖిల్ మూవీలో నన్ను చిన్న రోల్ కోసం అడిగితే నో నో అంత చిన్న పాత్రలో ఆయన్ని వద్దని,అంత చిన్న పాత్ర కోసం ఆయన్ని అడిగితే మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పోతుంది అని చెప్పావట కదా అంటూ గుర్తు చేశారు జగపతి బాబు. దానికి నాగార్జున అవును అంత చిన్న పాత్రలో మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం లేదు.అందుకే వద్దని చెప్పానని నాగార్జున ఆన్సర్ ఇచ్చారు.దానికి జగపతిబాబు థాంక్స్ చెబుతూ..
అసలు ఈ విషయంలో మీకు సంబంధం లేదు.కానీ మీరు చేసిన పనికి నిజంగా మీకు థాంక్స్.. ఐ లవ్ యువర్ ఎథిక్స్ అంటూ నాగార్జునని పొగిడారు జగపతిబాబు. అయినా దీనికంటే ముందు మనం ఫ్రెండ్స్ కదా అంటూ నాగార్జున కూడా చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా అఖిల్ సినిమాలో చిన్న పాత్ర కోసం జగపతిబాబుని అడిగితే ఆయనకు అవసరం లేకున్నా కూడా అలాంటి పాత్రలో వద్దని చెప్పి జగపతి బాబు క్రేజ్ ఎలాంటిదో బయట పెట్టారు నాగార్జున.
