Begin typing your search above and press return to search.

అఖిల్ కోసం రంగంలోకి నాగ్.. వర్కౌట్ అవుతుందా?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లెనిన్ విడుదలకు ముందే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

By:  M Prashanth   |   20 April 2026 3:50 PM IST
అఖిల్ కోసం రంగంలోకి నాగ్.. వర్కౌట్ అవుతుందా?
X

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లెనిన్ విడుదలకు ముందే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా ఫైనల్ కట్ దశలో అక్కినేని నాగార్జున స్వయంగా ఎడిటింగ్ రూమ్‌ లోకి అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

ఇప్పటికే అఖిల్ గత చిత్రాలైన ఏజెంట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల సమయంలో కూడా నాగార్జున ఎడిటింగ్ ప్రక్రియలో పాల్గొన్న విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆయన సూచనలు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ, మరికొన్ని సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో లెనిన్ విషయంలో నాగ్ తీసుకున్న జాగ్రత్తలు ఎంతవరకు వర్క్ అవుతాయో అన్న ఆసక్తి నెలకొంది.

వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ లో పరువు హత్యల వంటి సున్నితమైన అంశంతో రూపొందిస్తున్నారు. మొదట ఆ మూవీని మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, మరింత క్వాలిటీ కోసం విడుదలను జూన్ 26కి వాయిదా వేశారు. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాతో పోటీని తప్పించుకోవడం కూడా నిర్ణయానికి టాక్ వచ్చింది.

రీసెంట్ గా ఫైనల్ కట్ చూసిన నాగార్జున సినిమా నిడివి సహా పలు విషయాల్లో కొన్ని కీలక మార్పులు సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా వివిధ సన్నివేశాలు ల్యాగ్‌ గా అనిపించడంతో వాటిని ట్రిమ్ చేయాలని సూచించారట. ఆయన సూచనల మేరకు ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలి ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను కట్ చేస్తూ సినిమాను మరింత గ్రిప్పింగ్‌ గా మార్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

ఎక్కడా బోర్ అనిపించకుండా ఎమోషనల్ గ్రాఫ్‌ ను సరిచేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక లెనిన్ లో హీరోయిన్‌ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల విడుదలైన యెట్టా యెట్టా పాట ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్‌ గా మారనుంది.

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ చిత్రం మీద అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు అఖిల్‌ కు సరైన కమర్షియల్ హిట్ రాకపోవడంతో, లెనిన్ సినిమాతో ఆయన గట్టి కమ్‌ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి నాగార్జున అనుభవం, ఎడిటింగ్‌ లో తీసుకుంటున్న జాగ్రత్తలు సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానున్న లెనిన్.. అఖిల్ కెరీర్‌ లో టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.