Begin typing your search above and press return to search.

నాగార్జున రిస్క్ అని తెలిసినా సరే..?

ఎందుకంటే నాగార్జున మొన్న కుబేరలో రాబోతున్న కూలీలో విలన్ రోల్ ఇలా చేయడం వల్ల హీరోగా తను చేయాల్సిన సినిమాల పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

By:  Ramesh Boddu   |   6 Aug 2025 10:01 AM IST
నాగార్జున రిస్క్ అని తెలిసినా సరే..?
X

కింగ్ నాగార్జున సడెన్ ట్విస్ట్ ఫ్యాన్స్ ని ఇరకాటంలో పడేస్తుంది. హీరోగా చేస్తూనే డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనే ఆయన తపన తెలుస్తున్నా అది ఏమాత్రం తేడా వచ్చినా కూడా కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. సినీ పరిశ్రమలో కొన్ని విషయాల్లో ఏదైనా స్టెప్ తీసుకునే ముందు చాలా ఆలోచించాలి. లేకపోతే కెరీర్ ఛాలెంజింగ్ గా మారుతుంది. నాగర్జున కూడా హీరోగా చేస్తూ సడెన్ గా కుబేరలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.

శేఖర్ కమ్ముల ఎలా చెప్పి ఒప్పించాడో కానీ ధనుష్ కుబేరలో నాగార్జున హీరోగా మాత్రం కనిపించలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ లేటెస్ట్ గా కూలీ సినిమాతో వస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాలో సైమన్ రోల్ విలన్ గా సర్ ప్రైజ్ చేయనున్నాడు. నాగార్జున బ్యాడ్ గాయ్ రో ఫ్యాన్స్ కి షాకింగే.. ఈ డెసిషన్ వెనక నాగార్జున మాస్టర్ ప్లాన్ ఏంటన్నది తెలియట్లేదు.

కూలీలో విలన్ రోల్..

ఎందుకంటే నాగార్జున మొన్న కుబేరలో రాబోతున్న కూలీలో విలన్ రోల్ ఇలా చేయడం వల్ల హీరోగా తను చేయాల్సిన సినిమాల పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ మంచి స్ట్రాటజీతోనే నాగ్ ఇలా చేస్తున్నారని తెలుస్తుంది. ఈమధ్య సినిమాల్లో ఎలాంటి రోల్ చేశామన్నది కాదు ఆడియన్స్ కి ఎంత బాగా రీచ్ అయ్యామన్నది ఇంపార్టెంట్ అనేలా ఉంది. అందుకే నాగార్జున కూడా విలన్ గా తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

ఐతే దీని వల్ల ఎంతో కొంత రిస్క్ తప్పదు. కానీ హీరోగా ఒకరు అవకాశం ఇస్తే సినిమాలు చేసేంత అవసరం నాగార్జునకు లేదు. సో ఆయన దగ్గరకు వచ్చిన కథలను ఆయనే తీసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఏదైనా సినిమా నాగార్జున చేయాలంటే నిర్మాతలు కూడా రెడీగా ఉంటారు. సో నాగార్జున ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ఆయన కెరీర్ కు ఇబ్బంది ఉండే ఛాన్స్ లేదు. ఐతే నాగార్జున కాకుండా మిగతా హీరోలు ఇలా చేస్తే మాత్రం హీరోగా మర్చిపోయి ఇలానే విలన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే ఇస్తుంటారు.

కెరీర్ డిసైడ్ చేసే చిన్న స్థాయి కాదు నాగార్జునది..

కుబేర, కూలీ ఈ రెండు సినిమాలు నాగార్జున చేయడానికి మెయిన్ రీజన్ నెక్స్ట్ తను ఇలాంటి రోల్స్ కూడా చేస్తా అని ఒక హింట్ ఇవ్వడానికే. ఐతే ఒకటి రెండు సినిమాలు నెక్స్ట్ కెరీర్ డిసైడ్ చేసే చిన్న స్థాయి కాదు నాగార్జునది. అందుకే ఈ సినిమాల్లో ఇలాంటి రోల్స్ చేసినా మళ్లీ ఆయన లీడ్ రోల్ సినిమాలనే చేస్తారు. కాకపోతే ఏదైనా ఛాలెంజింగ్ రోల్ హీరో ఇమేజ్ ఉండాలి కానీ విలనిజం చేయాలి అంటే తను గుర్తువచ్చేలా తన పాజిబిలిటీస్.. తన ఇంట్రెస్ట్ లు చూపిస్తున్నారు నాగార్జున.

సీనియర్ హీరోల్లో ఇలాంటి ఒక అటెంప్ట్ కొత్తేమి కాదు. మలయాళంలో ఆల్రెడీ మోహన్ లాల్, మమ్ముట్టి చేస్తూనే ఉన్నారు. వాళ్ల పంథాలోనే నాగార్జున కూడా అటు సోలో సినిమాలు చేస్తూనే మంచి సినిమా అంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అనేస్తున్నారు.