నాగార్జున కూల్ లుక్స్.. నిజంగా వయసు 65ఏళ్లేనా?
తాజాగా రజనీకాంత్ కూలీలో ఏకంకా విలన్ గా నటించి మెప్పించారు. స్టార్ హీరో అయినప్పటికీ.. సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో ఆయన ఏజ్ గ్రూప్ హీరోలకు కొత్త రూటు చూపిస్తున్నారు.
By: M Prashanth | 16 Aug 2025 1:27 AM ISTఅక్కినేని నాగార్జున పేరుకు పరిచయం అవసరం లేదు. 60ల్లోనూ ఫిట్ నెస్, అందంలో ఆయన ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు పోటీనిస్తుంటారు. మాస్ అయినా, క్లాస్ అయినా రొమాంటిక్ పాత్రలైనా.. భక్తిరస చిత్రాలకైనా నాగార్జునకు సాటి రారు ఎవరు. విభిన్న కథలు ఎంపిక చేసుకొని ప్రేక్షకుకు కొత్త దనం పంచుతుంటారు.
శివమణిలాగా స్టైల్ గా ఉంటూనే, రామదాసుగా ఆధ్యత్మిక కోణం చూపిస్తారు. బాస్, మన్మధుడు లాంటి చిత్రాల్లో లవర్ బాయ్ గా కనిపించి రాజన్న లో ఫైటర్ గానూ అలరించారు. అలా ఆయన సుదీర్ఘ కెరీర్ లో చేసిన ప్రయత్నాలే, మన్మధుడు, అన్నమయ్య, రామదాసు, శిర్డీ సాయి, రాజన్న, సోగ్గాడే చిన్నినాయన సినిమాలు. ఇవి ఆయను ఓ ప్రత్యేకంగా చూపించాయి.
ఇక ఇటీవల కుబేర సినిమాతో సక్సెస్ అందుకున్న నాగ్, తాజాగా రజనీకాంత్ కూలీలో ఏకంకా విలన్ గా నటించి మెప్పించారు. స్టార్ హీరో అయినప్పటికీ.. సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో ఆయన ఏజ్ గ్రూప్ హీరోలకు కొత్త రూటు చూపిస్తున్నారు. ఇటీవల కూలీ ఆవెంట్ లోనూ ఎప్పుడూ మంచివాడిలాగా నటించి బోర్ కొడుతుంది. అందుకే నెగిటివ్ రోల్ కు ఒప్పుకున్నానని ఆయన వ్యాఖ్యానించడం సినిమాపై ఆయనకు ఉన్న ప్యాషన్ ను తెలియజేస్తుంది.
అయితే ఇదంతా ఆయన ఫిల్మ్ కెరీర్. ఇందులో ఎంత ప్యాషన్ తో ఉంటారో పర్సనల్ లైఫ్ స్టైల్ కూడా అంత అత్యుత్తమంగానే ఉంటుంది. ఆయన లైఫ్ స్టైల్, ఫిట్ నెస్, హెయిర్ స్టైల్ ఇలా అన్ని అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే నాగ్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండరు. తన ఫొటోలు కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేయరు. కానీ, ఒక్కసారి ఏదైనా ఫొటో బయటకు వచ్చిందటే అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే.
అలా తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూలీ సినిమా సెట్స్ లో తీసినట్లుగా ఉంది. ఇందులో కింగ్ బ్లాక్ టీర్టు, పైన ఆలీవ్ గ్రీన్ కోట్ ధరించారు. కింద వైట్ కలప్ ప్యాంట్, వైట్ బార్డర్ తో ఉన్న బ్లాక్ లోఫర్ షూస్ లో నాగార్జున మన్నధుడిలాగా కనిపిస్తున్నారు. ఆయన తెలుగు బీఎమ్ డబ్యూ కార్ పై అలా చేయి వేసి.. సన్ గ్లాసెస్ లో కింగ్ లుక్స్ ఫ్యాబులస్ గా ఉన్నాయి. ఈ ఫొటో చూసిన తర్వాత ఆయన వయసు 60+ అంటే ఎవరు కూడా నమ్మరు. ఈ ఫొటో అక్కినేని అభిమానులనే కాదు తెలుగు సినిమా లవర్స్ అందర్నీ ఆకర్షిస్తుంది.
