'మనం' దృశ్యంలో అక్కినేని పెద్ద కోడలు
వీడియో కింద వచ్చిన ప్రతిస్పందనల్లో ఎక్కువ భాగం ఈ దృశ్యాలను బంధించిన కెమెరామన్ ప్రతిభను అభినందించడానికే ప్రాధాన్యత ఇచ్చాయి.
By: Sivaji Kontham | 28 Aug 2026 9:29 AM ISTటాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకల సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను అలరించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నాగార్జున- అమల, నాగచైతన్య - శోభిత ధూళిపాళ కలిసి ప్రయాణం అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా.. ఒకరికొకరు ఆప్యాయంగా తోడు నీడగా కనిపిస్తూ విమానాశ్రయం వైపు అడుగులు వేయడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
అక్కినేని కుటుంబంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన తర్వాత.. కుటుంబ సభ్యులందరూ ఇలా ఒకే చోట కలవడం అభిమానులకు ప్రత్యేకమైన దృశ్యంగా మారింది. నాగచైతన్య -శోభిత జంటగా కనిపించడం.. అమల - నాగార్జునల రాయల్ లుక్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. `కింగ్` బర్త్‌డే వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవడానికి వీరంతా కలిసి వెళ్తున్నారనే సమాచారం అక్కినేని అభిమానులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విడుదలైన నిమిషాల్లోనే వేలాది లైక్‌లు , కామెంట్లతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. క్లాసిక్ చిత్రం `మనం`లోని భావోద్వేగమైన నేపథ్య సంగీతాన్ని ఈ వీడియోకు జోడించడంతో అభిమానులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వీరిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన నెటిజన్లు `అందమైన కుటుంబం` అని.. అక్కినేని వారసత్వం , బంధాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తూ తమ శుభాకాంక్షలు తెలిపారు.
వీడియో కింద వచ్చిన ప్రతిస్పందనల్లో ఎక్కువ భాగం ఈ దృశ్యాలను బంధించిన కెమెరామన్ ప్రతిభను అభినందించడానికే ప్రాధాన్యత ఇచ్చాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలలోని ఇటువంటి ఆనందకరమైన ఘట్టాలను అభిమానులకు చేరువ చేయడం విశేషమని కొందరు కామెంట్ చేశారు. శోభిత ధూళిపాళ అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన తీరు.. తన ఫ్యాషన్ సెన్స్- పద్ధతులపై చాలామంది సానుకూలంగా స్పందిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అక్కినేని కుటుంబం ప్రదర్శించిన ఈ ఐక్యత, అనుబంధం సోషల్ మీడియాలో ఒక వేడుకలా మారింది. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎంతో కట్టుదిట్టమైన బంధాలతో మెలిగే ఈ ఫ్యామిలీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలని... మరిన్ని మంచి విజయాలు సాధించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. సమంత ఆ కుటుంబంతో లేకపోవడాన్ని కొందరు విమర్శించినా కానీ... అక్కినేని కుటుంబం `మనం` సీక్వెల్ లో నటించాలని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
