ఏఎన్ఆర్ చివరి క్షణాలు అంత దారుణంగా గడిచాయా.. నాగ్ ఎమోషనల్ కామెంట్స్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన అతి తక్కువ మంది హీరోలలో ఏఎన్ఆర్ ప్రథమ స్థానంలో ఉంటారు.
By: Madhu Reddy | 18 Aug 2025 10:16 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన అతి తక్కువ మంది హీరోలలో ఏఎన్ఆర్ ప్రథమ స్థానంలో ఉంటారు. ముఖ్యంగా ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు తో పాటు మరికొంతమంది అగ్ర హీరోలు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో తమ వంతు ప్రయత్నం చేశారు. నేడు సినీ పరిశ్రమ రోజు రోజుకీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటోంది అంటే దానికి నాడు వీరు వేసిన బీజమే అని చెప్పాలి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏఎన్ఆర్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. జీవితంలో అన్నీ అనుభవించారు.కానీ చివరి క్షణాలు మాత్రం అత్యంత దారుణంగా గడిచాయి అని ఆయన కొడుకు నాగార్జున తాజాగా చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ హీరో జగపతిబాబు వ్యాఖ్యాతగా చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకి వచ్చి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో విడుదలవ్వగా.. ఇందులో నాగార్జున తన తండ్రి చివరి క్షణాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు తన తండ్రి మాట్లాడిన మాటలను కూడా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. మరి ఇంతకీ ఇండస్ట్రీలోకి నాగార్జున ఎంట్రీ ఇద్దామనుకున్న సమయంలో ఏఎన్ఆర్ ఏమన్నారు..? నాగార్జున ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరు ప్రోత్సహించారు? ఏఎన్ఆర్ చివరి క్షణాలు ఎలా గడిచాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వరరావు ఈ ఇద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు మూల స్తంభాల్లాంటివారు. అలా అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే వారికి ఇండస్ట్రీలో కచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. అలా ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఏఎన్ఆర్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి లాగే సక్సెస్ అందుకున్నారు. అయితే నాగార్జునకి ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి లేదట. ఇదే విషయంపై షోలో నాగార్జున మాట్లాడుతూ.. "నా సోదరుడు వెంకట్ నా దగ్గరకు వచ్చి నాగ్ నువ్వెందుకు సినిమాలో హీరోగా ట్రై చేయకూడదు అని అడిగారు. దాంతో వెంకట్ కి వచ్చిన ఆలోచనని దృష్టిలో పెట్టుకొని.. నేను, అన్నయ్య నాన్న దగ్గరికి వెళ్లి.. నాన్న నేను సినిమాల్లోకి వస్తాను అని చెప్పాను. ఆ మాటకు నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అలా నాన్న సపోర్ట్ తో ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాను. ఆ తర్వాత నా సొంత నిర్ణయాలతో సినిమాలను చేయడం మొదలుపెట్టాను. అలా నేను నటించిన భక్తిరసకావ్యం 'అన్నమయ్య'. ఈ సినిమా విడుదలయ్యాక నాన్న నా దగ్గరికి వచ్చి.. నా చేతులు పట్టుకొని నువ్వు హీరోగా సాధించేసావ్ అనే ఫీలింగ్ తో హ్యాపీగా ఫీల్ అయ్యారు . అయితే ఆరోజు నాన్న సంతోషాన్ని చూసి.. ప్రపంచాన్నే జయించేసాను అనేంతలా పొంగిపోయాను. ఇక అదే నా జీవితంలో బెస్ట్ అండ్ ఎవర్ మూమెంట్ అంటూ ఒక్కసారిగా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు నాగార్జున.
అలాగే తండ్రి చివరి క్షణాల గురించి చెబుతూ.." మా నాన్న తన చివరి క్షణాలలో కనీసం బెడ్ మీద నుండి కూడా పైకి లేవలేకపోయారు..ఆ సమయంలో ఆయన్ని చూసి తట్టుకోలేకపోయాం "అంటూ నాగార్జున లైవ్ లోనే ఎమోషనల్ అయ్యారు. మా నాన్నగారు ఇండస్ట్రీలో ఎలా అయితే బతకాలి అనుకున్నారో అలాగే బ్రతికారు. అనుకున్నది సాధించారు.. అంటూ తండ్రి చివరి క్షణాలను తలచుకొని ఎమోషనల్ అవుతూనే తన తండ్రి గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఏఎన్ఆర్ చివరి రోజులలో క్యాన్సర్ బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన తన ఆఖరి రోజుల్లో కుటుంబంతో కలిసి మనం అనే సినిమాను చివరిగా చేశారు. ప్రస్తుతం నాగార్జున మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని అభిమానులు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు.
