ఆ సినిమాకి నావల్ల ఉపయోగం లేదు.. కమర్షియల్ హిట్ కి కారణం వారే -నాగార్జున
స్టార్ హీరోల నోటి నుండి ఇలాంటి మాటలు నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.. అలాంటిది నాగార్జున ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు చాలామంది జనాలు.
By: Madhu Reddy | 19 Aug 2025 3:00 AM ISTఅక్కినేని నాగార్జున ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ మూవీతో మన ముందుకు వస్తూ ఉంటారు. అయితే హీరోగా సినిమాలను పక్కన పెట్టిన నాగార్జున.. ఇప్పుడు కూలీ, కుబేర వంటి సినిమాల్లో కీలకపాత్రల్లో నటించారు. ముఖ్యంగా కూలీలో నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టి తనలో ఉన్న మరో కోణాన్ని కూడా అభిమానులకు చూపించారు.అయితే అలాంటి నాగార్జున ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు. దానికి కారణం ఆయన రీసెంట్ గా పాల్గొన్న జయమ్ము నిశ్చయమ్మురా షో ముచ్చట్లే.. జగపతిబాబు హోస్టుగా చేస్తున్న ఈ షోకి నాగార్జున గెస్ట్ గా వచ్చి ఎన్నో విషయాలు పంచుకోవడంతో ఈ షోనే కాదు నాగార్జున, జగపతి బాబు కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ షోలో నాగార్జున పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆ షోలో నాగార్జున - శ్రీదేవి కాంబోలో వచ్చిన ఆఖరిపోరాటం సినిమా సమయంలో నాగార్జున కేవలం ఒక బొమ్మలాగా మాత్రమే నటించాను అంటూ చెప్పడమే.. విషయంలోకి వెళ్తే.. నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చిన టైంలో అక్కినేని హీరో అనే ట్యాగ్ తప్ప ఆయనకంటూ సెపరేట్ గుర్తింపు అయితే లేదట. అలా దాదాపు ఆయన చేసిన 7 సినిమాలు ఆయనకు ఇష్టం లేకుండానే పూర్తయ్యాయట. అందులో హిట్స్ ఉన్నా సరే తనకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ పంచుకున్నారు.
అలాగే ఆఖరి పోరాటం మూవీ గురించి చెబుతూ.. "ఈ సినిమా కేవలం శ్రీదేవి, రాఘవేంద్రరావు వల్లే ఆడింది. నేను కేవలం వాళ్ళు ఎలా చెబితే అలా ఆడే ఒక బొమ్మలాగా మాత్రమే పని చేశాను" అంటూ తన మనసులోని మాట నిర్భయంగా బయట పెట్టారు. ఇకపోతే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడానికి కారణం శ్రీదేవి రాఘవేంద్రరావు అని స్పష్టం చేశారు నాగార్జున. అయితే నాగార్జున లాంటి పెద్ద హీరోలు ఇలాంటి విషయాలను అస్సలు ఒప్పుకోరు. వారికి ఈగో అడ్డు వస్తుంది.కానీ నాగార్జున మాత్రం ఎలాంటి ఈగో లేకుండా ఈ సినిమా కేవలం శ్రీదేవి, రాఘవేంద్రరావు వల్లే ఆడిందని చెప్పడం గమనార్హం.
స్టార్ హీరోల నోటి నుండి ఇలాంటి మాటలు నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.. అలాంటిది నాగార్జున ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు చాలామంది జనాలు. ఎందుకంటే ఆఖరి పోరాటం సినిమా సమయానికి నాగార్జునకి అంత మార్కెట్ లేదు. కేవలం అక్కినేని హీరో అనే ట్యాగ్ మాత్రమే ఉంది. ఈ సినిమా కేవలం శ్రీదేవి ఇమేజ్ వల్లే ఆడింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే సమయంలో రాఘవేంద్రరావు దర్శకత్వం అంటే ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలా రాఘవేంద్రరావు డైరెక్షన్, శ్రీదేవి గ్లామర్ తో ఈ సినిమా గట్టెక్కిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో నాగార్జున కంటే శ్రీదేవి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రచయిత కూడా శ్రీదేవి పాత్రనే హైలెట్ చేశారు. అలా ఓవరాల్ గా నాగార్జున కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన ఆఖరిపోరాటం హిట్ క్రెడిట్ మొత్తం శ్రీదేవి, రాఘవేంద్రరావులకు ఇచ్చేశారు నాగార్జున.
ఆఖరి పోరాటం సినిమా హిట్ అయినా నాగార్జున దృష్టిలో మాత్రం శివ, గీతాంజలి ఈ రెండు సినిమాల వల్లే తనకు మార్కెట్ ఏర్పడింది అంటున్నారు. దానికి కారణం అప్పటివరకు నాగార్జున ఎవరో ఒకరు చెప్పిన సినిమాలు మాత్రమే చేశారట. కానీ శివ,గీతాంజలి సినిమాలు చేసేటప్పుడు మాత్రం సొంత నిర్ణయం తీసుకొని చేశారట. ఈ సినిమాలు తనకు సంతృప్తిని ఇచ్చాయి అంటూ కూడా నాగార్జున చెప్పుకొచ్చారు.
