100వ సినిమా... ఇంత సీక్రెట్ ఎందుకు?
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడో వందవ సినిమా మైలురాయిని దాటిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 11 March 2026 1:20 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడో వందవ సినిమా మైలురాయిని దాటిన విషయం తెల్సిందే. ప్రస్తుతం నాగార్జున 100వ సినిమా మైలు రాయి వద్ద నిలబడ్డాడు. సాధారణంగా ఏ హీరోకు అయినా వందవ సినిమా అంటే చాలా ప్రత్యేకమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా ప్రారంభం నుంచి షూటింగ్ జరుగుతున్న సమయంలో, విడుదల సమయంలో ఆ హీరోల అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. కానీ నాగార్జున వందవ సినిమా విషయంలో అంతా సైలెంట్ అన్నట్లుగా వ్యవహారం ఉంది. ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సినిమాకు సంబంధించిన వర్క్ మాత్రం స్పీడ్‌గా సాగుతోంది. సినిమాను కనీసం ప్రకటించకుండానే షూటింగ్ మొదలు పెట్టడం ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు నాగార్జున 100వ సినిమా విషయంలో ఇంత సీక్రెట్ అనేది చర్చనీయాంశంగా మారింది.
అక్కినేని నాగార్జున 100వ సినిమా...
అధికారికంగా నాగార్జున 100వ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు, మేకర్స్ నుంచి ఎలాంటి లీక్ లేదు. కానీ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది అనే విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున చాలా విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా చాలా సర్‌ప్రైజింగ్ గెస్ట్ అప్పియరెన్స్ ఉంటాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేశారనే వార్తలు వస్తున్నాయి. చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు ఈ సినిమా కోసం తమిళ దర్శకుడు రా కార్తీక్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆయన సైతం ఇప్పటి వరకు నాగార్జునతో సినిమా గురించి తెలుగు మీడియాతో స్పందించలేదు. కానీ ఇటీవల ఒక తమిళ మీడియాతో చేసిన చిట్ చాట్ సందర్భంగా కార్తీక్ తాను ప్రస్తుతం తెలుగు హీరో నాగార్జునతో సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
రా కార్తీక్ దర్శకత్వంలో నాగ్ 100వ సినిమా...
తెలుగు మీడియాలో సినిమా గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి. చాలా వరకు ఊహాగానాలు ప్రచురితం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు కార్తీక్ తమిళ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు మీడియాలో ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యత దక్కింది. గతంలో నాగార్జున కొన్ని సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించిన స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. నాగార్జున లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడట. నాగార్జున ఈ మధ్య కాలంలో చాలా యంగ్ అండ్ స్టైలిష్ లుక్ లో బయట కనిపించడం మనం చూశాం. కనుక అదే లుక్ తో ఇంకాస్త బెటర్‌మెంట్‌తో సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున అభిమానులను ఊరించే విధంగా కార్తీక్ వ్యాఖ్యలు ఉన్నాయి.
నాగార్జున, కార్తీక్ కాంబో మూవీ...
నాగార్జున గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను చవిచూడలేక పోయాయి. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైప్ క్రియేట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరో సినిమా, అది కూడా వందవ సినిమా కావడంతో హైప్ క్రియేట్ కాకుండా ఎలా ఉంటుంది అనేది కొందరి ప్రశ్న. నాగార్జున సినిమా అధికారికంగా ప్రకటన చేయక పోవడం వెనుక మరేదైనా ఉద్దేశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. సినిమా షూటింగ్ స్పీడ్‌గా జరుగుతుందని దర్శకుడు కార్తీక్ అన్నాడు కనుక ఇదే ఏడాదిలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మరిన్ని విషయాలు సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కినేని ఫ్యాన్స్ ఈ ఏడాది రెండు బ్లాక్‌బస్టర్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. నాగార్జున ఆ బ్లాక్ బస్టర్ ను ఈ సినిమాతో అందుకుంటాడా అనేది చూడాలి.
