కింగ్ సెంచరీ కొట్టేది యాక్షన్ డ్రామాతోనా!
ప్రయోగాలు వికటించిన సందర్బంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో అలెర్ట్ అవ్వడం నాగార్జునలో మరో స్పెషాల్టీ.
By: Srikanth Kontham | 20 Aug 2025 10:17 PM ISTకింగ్ నాగార్జున 100వ చిత్రం తమిళ దర్శకుడు రా.కార్తీక్ తో లాక్ అయిన సంగతి తెలిసిందే. కార్తీక్ తెరెక్కిం చింది ఒక్క సినిమాతో అయినా? కంటెంట్ పై నమ్మకంతో అవకాశం కల్పించారు. దీంతో కింగ్ లాక్ చేసిన స్టోరీ ఏమై ఉంటుంది? అన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నో యాక్షన్ చిత్రాలతో పాటు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతోనూ కింగ్ ప్రేక్షుకుల్ని అలరించారు. వైవిథ్యమైన కథల్లోనూ నాగార్జున మెప్పిం చారు. దీంతో వందవ సినిమా స్టోరీ లైన్ నాగ్ రివీల్ చేసారు.
నటుడిగా నిలబెట్టిన సినిమాలవే:
ఇది పూర్తిగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ప్రకటించారు. కథపై ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతుందన్నారు. ఏడాది క్రితమే కార్తీక్ కథ చెప్పాడని ఇప్పుడా కథ పూర్తి స్థాయిలో సిద్దమైందన్నారు. సినిమా గ్రాండ్ గా ఉంటుందన్నారు. ఇప్పటికే నాగ్ కెరీర్ లో ఎన్నో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లలలో నటించారు. కెరీర్ ఆరంభం నుంచి నాగార్జునను నటుడిగా నిలబెట్టిన చిత్రాలవే. ఫ్యామిలీ ఆడియన్స్ లో చిరస్థాయిగా నిలిచిపోయారంటే? కారణం ఎలాంటి కథ ఎంచుకున్నా? అందులో కుటుంబ నేపథ్యం ఉండేలా చూసుకున్నారు.
కొత్తగా ఏం చెప్పబోతున్నారు:
ప్రయోగాలు వికటించిన సందర్బంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో అలెర్ట్ అవ్వడం నాగార్జునలో మరో స్పెషాల్టీ. ఈ నేపథ్యంలోనే వందవ సినిమాలోనూ తనకు కలిసొచ్చిన అంశాన్నే కథా వస్తువుగా ఎంచుకు న్నారు. ఫ్యామిలీ కథకు యాక్షన్ అంశాన్ని జోడించి అందులో వైవిథ్యను చూపించే ఆస్కారం ఉంది. రా కార్తిక్ తొలి చిత్రం ఓసీడీ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కథలో వైవిథ్యత ఉన్నా ప్రేక్షకులకు ఆ చిత్రం అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో నాగ్ కోసం సిద్దం చేసిన యాక్షన్ ఫ్యామిలీ స్టోరీ ప్లాట్ లో కొత్త దనానికి ఎంత వరకూ ఛాన్స్ తీసుకుంటున్నారో చూడాలి.
అతి త్వరలోనే లాంచ్:
ఈ చిత్రానికి `100 నాటౌట్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో ఫెయి ల్యూర్ కంటే సక్సెస్ లే ఎక్కువగా ఉండటంతో ఈ టైటిల్ పరిశీలనలో ఉందన్నది మార్కెట్ లో గట్టిగా వినిపిస్తోన్న మాట. ఇదే నిజమైతే కథను నాగ్ ఎంతగా విశ్వశిస్తున్నారు? అన్నది అద్దం పట్టినట్లే. హీరోగా నాగార్జున సోలో చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాదిన్నర అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కింగ్ హీరో ఎంట్రీ కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే 100వ చిత్రం పట్టాలెక్కనుంది.
