నాగ్ సర్.. బర్త్ డే వదిలేశారేంటి..?
నాగార్జున తన వర్సటాలిటీ ప్రూవ్ చేసుకోవాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అనుకుంటున్నా ఇప్పుడే ఆ రోల్స్ ఎందుకు నాగ్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.
By: Ramesh Boddu | 30 Aug 2025 2:00 PM ISTకింగ్ నాగార్జున ఈమద్యనే కుబేర, కూలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండేళ్ల క్రితం నా సామిరంగ సినిమాతో సక్సెస్ అందుకున్న నాగార్జున ఆ తర్వాత సోలో సినిమా చేయడం పక్కన పెట్టి కుబేరలో దీపక్, కూలీ సినిమాలో సైమన్ రోల్ చేశారు. నాగార్జున తన వర్సటాలిటీ ప్రూవ్ చేసుకోవాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అనుకుంటున్నా ఇప్పుడే ఆ రోల్స్ ఎందుకు నాగ్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. ఐతే నాగార్జున ఇప్పటివరకు 99 సినిమాల్లో నటించారు.
కార్తీక్ తో నాగ్ 100వ సినిమా..
నాగ్ 100వ సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఈమధ్యనే ఒక స్పెషల్ ఇంటర్వ్యూకి వెళ్లి అక్కడ 100వ సినిమా గురించి లీక్ ఇచ్చారు. తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ తో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని.. ఒక మంచి కథ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుందని అన్నారు నాగార్జున. ఐతే ఎలాగు ఇంటర్వ్యూలో చెప్పేశాడు కాబట్టి బర్త్ డేకి సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని అనుకున్నారు.
ఆగష్టు 29 అంటే నిన్న శుక్రవారం నాగార్జున బర్త్ డే.. సెలబ్రిటీస్ అంతా విష్ చేయడం తప్ప నాగార్జున సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా అప్సెట్ అయ్యారు. డైరెక్టర్ గురించి నాగార్జున లీక్ ఇచ్చి సినిమా ప్రకటించకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. ఐతే నాగార్జున 100వ సినిమా అనౌన్స్ మెంట్ నెక్స్ట్ మంత్ ఉండొచ్చని అంటున్నారు.
అక్కినేని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్..
సెప్టెంబర్ 20 ఏఎన్నార్ బర్త్ యానివర్సరీ ఉంది. ఆయన రోజు 100వ సినిమా అనౌన్స్ మెంట్ చేయాలని అనుకుంటున్నారట నాగార్జున. నాగార్జున సినిమా అనౌన్స్ మెంట్ చేయడమే లేట్ అని.. సినిమా స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిందని తెలుస్తుంది. దాదాపు ఏడాదిన్నర రెండేళ్లుగా ఆ సినిమాపై వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. సో నాగార్జున 100వ సినిమా అంచనాలకు మించి అదరగొట్టేస్తుందని అంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయంలో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
నాగార్జున 100వ సినిమాను చాలా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో వారసుల క్యామియో ఉంటుందని ఒక టాక్ నడుతుంది. సో లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా నాగార్జున ప్లాన్ ఉందని తెలుస్తుంది. 100వ సినిమా డైరెక్టర్ ఓకే మరి మిగతా కాస్టింగ్ తో పాటు డీటైల్స్ కూడా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.
