Begin typing your search above and press return to search.

సెంచ‌రీ విష‌యంలో షాక్ ఇచ్చిన నాగ్ అండ్ కో!

కింగ్ నాగార్జున 100వ చిత్రం త‌మిళ ద‌ర్శ‌కుడు `రా` కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   12 March 2026 4:00 PM IST
సెంచ‌రీ విష‌యంలో షాక్ ఇచ్చిన నాగ్ అండ్ కో!
X

కింగ్ నాగార్జున 100వ చిత్రం త‌మిళ ద‌ర్శ‌కుడు `రా` కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.ల్యాండ్ మార్క్ చిత్ర కావ‌డంతో? నాగార్జున ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్ లోనే సినిమా చేస్తున్న‌ట్లు అంతా భావిస్తున్నారు. ఇదొక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంతా అనుకుంటున్నారు. కానీ రా కార్తిక్ ఇచ్చిన తాజా ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ అయింది. ఈషాక్ తో ప్రేక్ష‌కులే కాదు అక్కినేని అభిమానులు సైతం స్ట‌న్ అవుతున్నారు.

ఈ చిత్రం గురించి తొలుత `బంగార్రాజు` తరహాలో పల్లెటూరి నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం అని ప్రచారం జరిగింది. నాగార్జున కూడా సాఫ్ట్ లుక్‌లో కనిపిస్తుండటంతో మ‌రోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేశారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా గురించి కార్తీక్ తాజాగా ఏమన్నాడంటే? `ఇందులో కుటుంబ విలువలు ఉన్న మాట వాస్తవమే .కానీ ఇది పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని బాంబు పేల్చాడు. ఈ ట్విస్ట్‌తో ట్రేడ్ వర్గాలు కూడా విస్తుపోయాయి.

సినిమాలో నాగార్జున పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందిట‌. ఒక సాదాసీదా కుటుంబ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికి వెళ్ళాడు అనే పాయింట్‌తో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారట. సినిమాలో స్టంట్స్ , ఫైట్ మాస్టర్స్ పనితనం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటుందని, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ నాగార్జున కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని కార్తీక్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ యాక్షన్ ట్విస్ట్ వెనుక నాగార్జున ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. `వైల్డ్ డాగ్`, `ది ఘోస్ట్` వంటి చిత్రాలతో యాక్షన్ జోనర్‌లో ప్రయోగాలు చేసిన నాగ్ ఈసారి ఆ యాక్షన్‌కు బలమైన ఎమోషన్‌ను జోడించాలని కార్తీక్‌కు సూచించారట. కేవలం గన్‌లు, పేలుళ్లు మాత్రమే కాకుండా కథలో అంతర్లీనంగా సాగే ఉత్కంఠ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతుందని చిత్ర యూనిట్ అంటోంది. అందుకే ఇదొక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న‌ట్లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నాగార్జున సరికొత్త మేకోవర్‌తో ఆకట్టుకుంటార‌ని తెలుస్తోంది. వెండి తెరపై నాగ్ చూపించే యాక్షన్ విన్యాసాలు ఒక స్వీట్ సర్ ప్రైజ్ కానున్నాయంటున్నారు. దర్శకుడు ఇచ్చిన చిన్న క్లూతో అక్కినేని ఫ్యాన్స్ లో అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ్యామిలీ సినిమా అని డీలా ప‌డిన అభిమానులంతా నాగ్ స‌ర్ యాక్ష‌న్ సినిమా చేస్తున్నారు? అనే స‌రికి ఉత్సాహం నిండుకుంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ మైసూర్ లో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా స్టోరీ అక్క‌డ లోకేష‌న్లు డిమాండ్ చేయ‌డంతో పాటు మైసూర్ నాగ్ సెంటిమెంట్ కావ‌డంతో? కీల‌క భాగ‌మంతా మైసూర్ లోనే షూట్ చేస్తున్నారు.