కింగ్ సెంచరీ ఇంత సైలెంట్ గానా?
కింగ్ నాగార్జున 100వ చిత్రం రా. కార్తిక్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
By: Srikanth Kontham | 31 Dec 2025 7:00 AM ISTకింగ్ నాగార్జున 100వ చిత్రం రా. కార్తిక్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నాగార్జున వందవ సినిమా కావడంతో బయట నిర్మాణ సంస్థలు వేటికి అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా నిర్మించాలని నాగార్జున ముందే డిసైడ్ అయ్యారు. అనుకు న్నట్లే ప్రాజెక్ట్ గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టినట్లు మాత్రం ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో? షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా ఇప్పటికే సెట్స్ లో ఉందన్నది తాజా అప్ డేట్.
నాగార్జున సహా ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు తెలిసింది. జనవరి నుంచి కొత్త షెడ్యూల్ కేరళలో మొదలవుతుందని సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చకాచకాగా జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ లో నాగార్జునతో పాటు టబు, సుష్మితా భట్ కూడా పాల్గొంటారని సమాచారం. మరో నాయికగా అనుష్క శెట్టి పేరు కూడా వినిపిస్తుంది. కానీ అనుష్క ఎంట్రీ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం నాగ్ సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. `నా సామి రంగ` తర్వాత నాగ్ సోలో రిలీజ్ చేయలేదు.
ఈ ఏడాది `కుబేర`,` కూలీ` లాంటి చిత్రాల్లో కీలక పాత్రకే పరిమితమయ్యారు. దీంతో తదుపరి సోలో రిలీజ్ తో భారీ విజయం అందుకోవాలని ఆశ పడుతున్నారు. ఇంత వరకూ నాగార్జున కెరీర్ లో కోట్ల వసూళ్ల సినిమా ఒకటీ లేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. సరైన స్టోరీలు పడక పోవడంతోనే సీనియర్ హీరోల్లో నాగ్ వెనుక బడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్లు 100 కోట్ల మార్క్ ను దాటేసారు. వారంతా కొత్త రికార్డుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నాగ్ ఇంకా? సెంచరీ కోసం ప్రయత్నించడం అభిమా నుల్ని నిరుత్సాహ పరుస్తోంది.
ఈ నేపథ్యంలో 100వ చిత్రంతోనైనా వంద కోట్ల స్టార్ అవుతాడని అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నా రు. ఈ సినిమా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసి 2026 మిడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే అఖిల్ నటిస్తోన్న `లెనిన్` సినిమా నిర్మాణంలో నాగార్జున భాగమయ్యారు. అఖిల్ సక్సెస్ కోసం నాగార్జున అంతే ఆసక్తిగా ఉన్నారు. `తండేల్` తో నాగచైతన్య 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో అఖిల్ కూడా ఆ రేంజ్ హిట్ అంకోవాలని ఓ తండ్రి గా నాగ్ ఎదురు చూస్తున్నారు. మరి 2026 తండ్రీ తనయులకు ఎలా కలిసొస్తుందో చూడాలి.
