Begin typing your search above and press return to search.

కింగ్ సెంచ‌రీ ముహూర్తం ఫిక్సైంది!

కింగ్ నాగార్జున 100వ చిత్రం త‌మిళ ద‌ర్శ‌కుడు రా.కార్తీక్ తో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   17 Sept 2025 4:00 AM IST
కింగ్ సెంచ‌రీ ముహూర్తం ఫిక్సైంది!
X

కింగ్ నాగార్జున 100వ చిత్రం త‌మిళ ద‌ర్శ‌కుడు రా.కార్తీక్ తో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ తెరెక్కిం చింది ఒక్క సినిమాతో అయినా? కంటెంట్ పై న‌మ్మ‌కంతో అవ‌కాశం క‌ల్పించారు. కొన్ని నెల‌లుగా జ‌రుగు తోన్న స్టోరీ ప్రోస‌స్ ని నాగ్ ఒకే చేయడంతో ఫైన‌ల్ గా ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇది పూర్తిగా యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా ఉంటుంద‌ని లీకులందుతున్నాయి. ఫ్యామిలీ క‌థ‌కు యాక్ష‌న్ అంశాన్ని జోడించి అందులో వైవిథ్య‌ను చూపించే ఆస్కారం ఉంది. వంద‌వ సినిమా విష‌యంలో నాగ్ ఎంత మాత్రం రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్ లోనే చేయాలి? అన్న ఉద్దేశంతో క‌లిసొచ్చిన పాయింట్ నే క‌థ వ‌స్తువుగా తీసుకుంటున్నారు.

సొంత నిర్మాణంలోనే కింగ్:

ప్ర‌యోగాలు చేసినా ఫెయిలైన ప్ర‌తీసారి నాగ్ కెరీర్ ని ప‌ట్టాలెక్కించింది ఈ జాన‌ర్ క‌థ‌లు కావ‌డంతోనే అంత కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా మాత్రం గ్రాండ్ గా ఉంటుంది. నాగార్జున సొంత బ్యాన‌ర్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `100 నాటౌట్` అనే టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ప్రారంభోత్స‌వంపై ఆస‌క్తి నెల‌కొంది.

ఇద్ద‌రు బిగ్ స్టార్స్ అతిధులుగా:

ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందంటూ నాగ్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అడుగుతూనే ఉన్నారు. కానీ ఏనాడు వాటిపై స్పందించ‌లేదు. అయితే ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్ట‌న్లు తెలిసింది. లాంచింగ్ ముహూర్తం కూడా పెట్టిన‌ట్లు స‌మాచారం. వంద‌వ సినిమా కావ‌డంతో మెగా స్టార్ చిరంజీవి అతిధిగా ఆహ్వానించి ఆయ‌న‌ చేతుల మీదుగా ప్రాజెక్ట్ ని లాంచ్ చేయాల‌ని కింగ్ భావి స్తున్నారుట‌. ఆయ‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు స్టార్ల‌ను కూడా అతిధులుగా ఆహ్వానించ‌బోతున్నారుట‌.

అందుకే అభిమానుల గుండెల్లో:

వీలైతే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనే అవ‌కాశం ఉందంటున్నారు. అదే జ‌రిగితే ప్రారంభోత్స‌వం మ‌రింత గ్రాండ్ గా ఉంటుంది. నాగార్జున ఆహ్వానిస్తే అందుబాటులో ఉంటే గ‌నుక ఇద్ద‌రు త‌ప్ప‌క హాజ‌ర వుతారు. ఇద్ద‌రితో నాగ్ బాండింగ్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. చిరంజీవి మంచి స్నేహితుడు. తారక్ ని త‌న పెద్ద కొడుకులాగే ట్రీట్ చేస్తారు నాగ్. చాలా విష‌యాల్లో చిరంజీవిని నాగ్ స్పూర్తిగానూ తీసుకుంటారు. లెజెండ‌రీ న‌టుడు ఏఎన్నార్ త‌న‌యుడే అయినా ? నాగ్ ఎంతో డౌన్ టౌ ఎర్త్. ఆ క్వాలిటీనే కోట్లాది మంది అభిమా నుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసింది.